Diabetes : డయాబెటిస్ సమస్య ఉన్నవారు తాము తీసుకునే డైట్ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. రోజంతా మీరు ఏం తిన్నా సరే షుగర్ లెవల్స్ పెరగకుండా చూసుకోవాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి. కొన్ని రకాల ఆహారాల్లో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కొన్నింటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇక కొన్ని ఫుడ్స్ విషయానికి వస్తే వాటిల్లో కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిల్లో ఏవి తింటే షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయో డయాబెటిస్ పేషెంట్లు గుర్తుంచుకోవాలి. లేదంటే షుగర్ లెవల్స్ పెరిగిపోయి ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
చక్కెర ఎక్కువగా ఉండే పండ్ల రసాలు, జ్యూస్‌లు, మిల్క్ షేక్‌లు, శీతల పానీయాలకు షుగర్ పేషెంట్లు దూరంగా ఉండాలి. ఇవి టేస్ట్ అద్భుతంగా ఉంటాయి. కానీ షుగర్ లెవల్స్‌ను మాత్రం అమాంతం పెంచుతాయి. ఇది డయాబెటిస్ పేషెంట్లకు ఏమాత్రం మంచిది కాదు. కనుక వారు ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఇక వేసవి సీజన్‌లో మనం చాలా ఎక్కువగా తినే పండ్లలో మామిడి పండు కూడా ఒకటి. ఇందులో అధిక మొత్తంలో ఫ్రక్టోజ్ ఉంటుంది. మామిడి పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. కనుక ఈ పండ్లను అధికంగా తింటే షుగర్ లెవల్స్ అమాంతం పెరిగే చాన్స్ ఉంటుంది. తక్కువ మోతాదులో మామిడి పండ్లను షుగర్ పేషెంట్లు తినవచ్చు. కానీ ఎక్కువగా తింటే మాత్రం షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కనుక మామిడి పండ్లను తినే విషయంలోనూ వారు జాగ్రత్త వహించాలి.
తేనె చక్కెర కాదు కనుక దాన్ని షుగర్ పేషెంట్లు తినవచ్చని భావిస్తారు. అయితే అందులోనూ మామిడి పండ్లలో మాదిరిగా ఫ్రక్టోజ్ ఉంటుంది. అందువల్ల తేనెను మోతాదులో తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి. అలాగే చెరుకు రసంలోనూ ఫ్రక్టోజ్, సూక్రోజ్ అధికంగా ఉంటాయి. చెరుకు రసాన్ని షుగర్ పేషెంట్లు ఎట్టి పరిస్థితిలోనూ కొంచెం కూడా తీసుకోరాదు. ఇది షుగర్ స్థాయిలను అమాంతం పెంచుతుంది. దీంతోపాటు కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆలుగడ్డలను కూడా తినరాదు. వీటిని తిన్నా కూడా షుగర్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి. కనుక షుగర్ పేషంట్లు తాము తీసుకునే డైట్ విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.