politics

Roja : రోజా ఆస్తుల విలువ ఎంతో తెలుసా ? షాక‌వుతారు..!

Roja : వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న మంత్రి రోజా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె మొద‌ట్లో టీడీపీలో ఉండేది. త‌రువాత వైసీపీలోకి వ‌చ్చింది. ఆ త‌రువాత ఎమ్మెల్యే అయి మంత్రిగా హోదాను అనుభ‌వించారు. అలాగే మంత్రి అవ‌క‌ముందు వ‌ర‌కు ఈమె జ‌బ‌ర్ద‌స్త్ షోలో జ‌డ్జిగా చేశారు. ప‌లు ఇత‌ర షోల‌లోనూ హోస్ట్‌గా చేశారు. ఇక రోజా భ‌ర్త సెల్వ‌మ‌ణి అన్న విష‌యం తెలిసిందే. ఈయ‌న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు. కానీ ఇప్పుడు సినిమాలు ఏవీ చేయ‌డం లేదు. ఈమెకు కుమారుడు కృష్ణ లోహిత్, కుమార్తె అన్షుమాలిక ఉన్నారు. వీరిద్ద‌రూ చ‌దువుల్లో రాణిస్తున్నారు.

కాగా రోజాకు భారీగా ఆస్తులు ఉన్నాయ‌ని అంద‌రూ అనుకుంటారు. కానీ ఆమెకు ఉన్న ఆస్తులు త‌క్కువే. గ‌తంలో ఆమె ఒక మెర్సిడెస్ బెంజ్ కారును కొన్నారు. దాని విలువ రూ.1 కోటి వ‌ర‌కు ఉంటుంద‌ని స‌మాచారం. దీంతో రోజా ఆస్తుల విష‌యం మ‌రోమారు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే రోజాకు అస‌లు ఆస్తులు ఎంత ఉన్నాయి.. అని అంద‌రూ ఆరాలు తీస్తున్నారు. అయితే 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆమె ఎన్నిక‌ల సంఘానికి అంద‌జేసిన అఫిడ‌విట్‌లో మాత్రం త‌న ఆస్తుల విలువ రూ.7.38 కోట్లు అని తెలియ‌జేశారు.

roja networth properties and assets value

రోజా త‌న ఆస్తి విలువ రూ.7.38 కోట్లు ఉంటుంద‌ని అప్ప‌ట్లో అఫిడ‌విట్‌లో చెప్పారు. అది ఇప్ప‌టికి 5 ఏళ్ళ్లు అయిపోయింది క‌నుక ఆమె ఆస్తులు ఇంకాస్త పెరిగి ఉంటాయ‌ని స‌మాచారం. ఇక అప్ప‌టి ప్ర‌కారం అయితే ఆ ఆస్తి విలువ‌లో స్థిరాస్తులు రూ.4.64 కోట్లు ఉండ‌గా, చ‌రాస్తులు రూ.2.74 కోట్ల వ‌ర‌కు ఉన్నాయి. ఆమెకు రూ.49 ల‌క్ష‌ల అప్పు ఉన్న‌ట్లు చెప్పారు.

రోజా కుమారుడు కృష్ణ లోహిత్‌, కుమార్తె అన్షుమాలిక‌ల పేరిట బ్యాంకుల్లో చెరో రూ.50 ల‌క్ష‌ల మేర ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. అలాగే రోజాకు రూ.1 కోటి విలువ చేసే కార్లు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఫార్చూన‌ర్‌, ఇన్నోవా క్రిస్టా, మ‌హీంద్రా స్కార్పియోల‌తోపాటు ఇంకో ఫోర్డ్ కారు కూడా ఉంది. ఇక ఆమె భ‌ర్త సెల్వ‌మ‌ణికి స్థిరాస్తులు ఏమీ లేవ‌ని చెప్పారు. అప్పు రూ.22 ల‌క్ష‌లు ఉండ‌గా.. ఆయ‌న‌కు రూ.58 ల‌క్ష‌ల చ‌రాస్తులు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో ఈ వివ‌రాల‌ను ఆమె అప్ప‌ట్లో అఫిడ‌విట్‌లో చెప్పారు. అయితే ఇప్పుడు ఆమె ఆస్తి రూ.10 కోట్ల‌కు పైగానే ఉంటుంద‌ని స‌మాచారం.

Admin

Recent Posts