సాధారణంగా అధిక శాతం మంది జ్వరం వస్తే బ్లాంకెట్ కప్పుకుని పడుకుంటారు. కొద్దిపాటి చలిని కూడా భరించలేరు. ఇక స్నానం అయితే అసలే చేయరు. జ్వరం వచ్చిన ఎవరైనా సరే స్నానం చేయకూడదని మనవాళ్లు బాగా నమ్ముతారు. జ్వరం వచ్చిన వారు స్నానం చేస్తే మంచిది కాదని అనుకుంటుంటారు. కానీ ఇందులో నిజం లేదు. ఎందుకంటే వైద్యులు చెబుతున్న ప్రకారం అయితే.. నిజానికి జ్వరం వచ్చినా కూడా భేషుగ్గా స్నానం చేయవచ్చు.
జ్వరం వచ్చిన వారు ఎలాంటి భయం లేకుండా స్నానం చేయవచ్చు. ఈ విషయాన్ని వైద్యులే చెబుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయవద్దనేది ఒక అపోహేనని, నిజానికి స్నానం చేస్తేనే మంచిదని అంటున్నారు.
జ్వరం వచ్చినప్పుడు సహజంగానే మన శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అది మందుల ద్వారా చాలా నెమ్మదిగా తగ్గుతుంది. కానీ స్నానం చేయడం వల్ల వేడి త్వరగా తగ్గుతుంది. దీంతో జ్వరం త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. ఇక జ్వరం వచ్చిన వారు వేడి నీటిని ఉపయోగించి స్నానం చేయవచ్చు. తలస్నానం కూడా చేయవచ్చని, ఏమీ కాదని వైద్యులు చెబుతున్నారు.
జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయడం వల్ల జ్వరాన్ని తగ్గించుకోవచ్చు. శరీంలో ఉండే వేడి త్వరగా బయటకు పోతుంది. దీంతో శరీరం చల్లబడుతుంది. మందుల ద్వారా అయితే చాలా నెమ్మదిగా జ్వరం తగ్గుతుంది. కానీ స్నానం చేస్తే జ్వరాన్ని వేగంగా తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే సర్జరీలు అయిన వారికి జ్వరం వస్తే మాత్రం స్నానం చేయరాదు. వేడి నీటిలో వస్త్రాన్ని ముంచి శరీరం తుడిస్తే చాలు. కానీ ఇతర కారణాల వల్ల జ్వరం వస్తే మాత్రం కచ్చితంగా స్నానం చేయాలి. దీంతో జ్వరం వేగంగా తగ్గుతుంది. శరీరంలోని వేడి త్వరగా బయటకు పోతుంది.