కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అత్యంత ఆవశ్యకం అయింది. అందులో భాగంగానే రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలను చాలా మంది తీసుకుంటున్నారు. వాటిల్లో తులసి ఒకటి. తులసి ఆకులను నేరుగా నమిలి తిన్నా లేదా రసం తాగినా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతోపాటు పలు అనారోగ్య సమస్యలు నయమవుతాయి.
తులసి ఆకులను రోజూ పరగడుపునే తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. వైరస్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇక పాలను సంపూర్ణ ఆహారంగా భావిస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ పాలను రోజూ తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
పాలలో దాదాపుగా అన్ని రకాల పోషకాలు లభిస్తాయి. వీటి వల్ల కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. ఇతర అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు. అయితే తులసి, పాలు రెండింటినీ ఒకేసారి తీసుకోవచ్చా ? వైద్యులు ఏమంటున్నారు ? అంటే..
తులసి, పాలను రెండింటినీ కలపడం వల్ల ఆ మిశ్రమం ఆమ్ల స్వభావాన్ని పొందుతుంది. అందువల్ల ఆ మిశ్రమం మన శరీరానికి మంచిది కాదు. కనుక రెండింటినీ కలిపి తీసుకోరాదు. తులసి ఆకులను ఉదయం తినాలి. రాత్రి పూట పాలు తాగాలి. దీంతో రెండు విధాలుగా ప్రయోజనాలు లభిస్తాయి. కానీ రెండింటినీ కలిపి తీసుకోరాదు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365