కరోనా నుంచి కోలుకున్న తరువాత చాలా మంది బాధితులు నీరసంగా ఉందని చెబుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తోంది. కరోనా వైరస్ రోగ నిరోధక వ్యవస్థపై బాగా ప్రభావం చూపినందునే ఈ విధంగా సమస్య వస్తుంది. అందువల్ల ఈ సమస్య నుంచి త్వరగా కోలుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోజూ తీసుకోవాలి. ఈ క్రమంలోనే నీరసం తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చు.
కరోనా నుంచి కోలుకున్నవారికి బాగా నీరసంగా అనిపిస్తుంటే వారు శక్తివంతమైన, పోషకాలు కలిగిన ఆహారాన్ని రోజూ తీసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని తెలియజేసింది. వారు పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు, ఆకు కూరలు, పప్పు దినుసులు, బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరం కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతుంది.
అలాగే విటమిన్లు సి, డిలతోపాటు జింక్, ఇతర మినరల్స్ ఉండే ఆహారాలను తినాలి. దీనివల్ల నీరసం తగ్గుతుంది. త్వరగా కోలుకుంటారు. కోవిడ్ నుంచి కోలుకున్నాక నీరసంగా ఉందని భావించేవారు తేలిగ్గా జీర్ణం అయ్యే, పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవడం మేలు. అలాగే ఎప్పటికప్పుడు వండిన తాజా ఆహారాలను తినాలి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. శక్తి అందుతుంది.
సిట్రస్ జాతికి చెందిన పండ్లను తినడం వల్ల కూడా కోవిడ్ నీరసం నుంచి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా నారింజ పండ్లను ఎక్కువగా తినాలి. అలాగే రోజూ గుప్పెడు మోతాదులో భిన్న రకాల నట్స్‌ను తీసుకోవాలి. రాత్రి పూట బాదంపప్పును గుప్పెడు మోతాదులో నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వాటిని తినాలి. అలాగే కిస్మిస్‌లను కూడా నానబెట్టి తింటే మంచిది. దీంతోపాటు వాల్‌నట్స్, ఖర్జూరాలను కూడా తీసుకోవాలి.
రోజూ పోషకాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం కూడా చేయాలి. దీంతో నీరసాన్ని తగ్గించుకోవచ్చు. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం, మనస్సు ప్రశాంతంగా మారుతాయి. ఎక్కువ శ్రమపడే వ్యాయామాలు కాకుండా తేలికపాటి వ్యాయామాలు చేస్తే మంచిది. దీంతో శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉంటుంది. వ్యాయామం జరుగుతుంది కనుక శక్తి అందుతుంది. నీరసం తగ్గుతుంది.
రోజూ ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలి. రాత్రి త్వరగా నిద్రించాలి. దీని వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. లేదంటే బద్దకం వస్తుంది. సోమరిపోతులా మారుతారు. ఏ పనీ చేయబుద్ది కాదు. ఇది నీరసానికి దారి తీస్తుంది. అందువల్ల తగినన్ని గంటల పాటు నిద్రపోవాలి. త్వరగా నిద్రపోవాలి. త్వరగా నిద్ర లేవాలి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. నీరసం తగ్గుతుంది.
కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా కోవిడ్ జాగ్రత్తలను పాటించాల్సిందే. బయటకు వెళ్లినప్పుడు మాస్కులను ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు, పల్స్ రేట్, బీపీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. అసాధారణ రీడింగ్స్ వస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే డయాబెటిస్ ఉన్నవారు అయితే తమ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలి. రాత్రి పూట గ్యాడ్జెట్లకు దూరంగా ఉండాలి. దీంతో నీరసం రాదు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365