ప్ర‌శ్న - స‌మాధానం

Cashew Vs Almonds : జీడిప‌ప్పు, బాదంప‌ప్పు.. రెండింటిలో ఏది మంచిది.. దేన్ని తింటే మ‌న‌కు మేలు జ‌రుగుతుంది..!

Cashew Vs Almonds : మనం నిత్యం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడి తమ చేతులారా అనేక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఏ ఆహారాన్ని తీసుకోవడం వలన మేలు కలుగుతుందనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. శరీరంలో ఎప్పుడైతే పోషకాహారలోపం ఏర్పడుతుందో అనేక వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. మరి ఇలా వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరానికి పోషకాలు ఉన్న ఆహారం అందించడం ఎంతో అవసరం.

మన శరీరానికి కావలసిన మంచి పోషకాలు అందించడంలో డ్రైఫ్రూట్స్ ముఖ్య పాత్ర వహిస్తాయి. రోజూ డ్రై ఫ్రూట్స్ తింటే పలు అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే రోజువారీ ఆహారంలో నట్స్ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ లో ఎక్కువగా వాడేవి బాదం, జీడిపప్పు. ఈ రెండింటిలోనూ గ్లూటెన్ లేకుండా విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. బాదం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత ప్రాణాంతక వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇతర గింజలతో పోలిస్తే బాదంలో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉండటం వలన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే బాదం పప్పు బరువును తగ్గించడంలో సహకరిస్తుంది. బాదం పప్పును రెగ్యులర్ గా తినటం వలన మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, మధుమేహ లక్షణాలు తగ్గించటానికి, మానసిక ఒత్తిడి తగ్గించటానికి సహకరిస్తుంది.

Cashew Vs Almonds which one is better for our health

జీడిపప్పు తినటానికి రుచిగా ఉండటమే కాదు.. ఇతర గింజలతో పోలిస్తే జీడిపప్పులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. దీనిలో 82 శాతం కొవ్వుతోపాటు ఆన్ సాచురేటెడ్ ఫ్యాట్స్‌ కూడా ఉంటాయి. ఈ ఆన్ సాచురేటెడ్ ఫ్యాట్ లో 66 శాతం గుండెకు రక్షణ కల్పించే మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. జీడిపప్పులో జింక్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పులో ఉండే ఐరన్ రక్త కణాలకు ఆక్సిజన్‌ను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రక్తహీనతను నివారిస్తుంది. ఇక మెగ్నీషియం జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అంతేకాక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల‌ను నివారించడంతోపాటు కంటి చూపు మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఇప్పుడు బాదం మరియు జీడిపప్పు రెండింటిలో ఏది తింటే బెటర్ అనేది చూద్దాం. బాదం పప్పు శరీరంలో పేరుకొన్న అదనపు కొవ్వును కరిగిస్తుంది. బాదం పప్పులో అమైనో ఆమ్లాలు ఉండుట వలన వ్యాయమం చేసే సమయంలో కొవ్వులు మరియు క్యాలరీలు బర్న్ చేయటానికి సహాయపడుతుంది. జీడిపప్పులో విటమిన్ కె మరియు జింక్‌ అధికంగా ఉంటుంది. జీడిపప్పులో కొవ్వు తక్కువగా ఉంటుంది. జీడిపప్పు తినటం వలన బరువు తగ్గటం అనేది జరగదు. బాదంలో ఫైబర్, విటమిన్ ఇ మరియు కాల్షియం అధికంగా ఉంటాయి. అధిక బరువు ఉన్నవారు బాదం పప్పు తింటే బరువు తగ్గుతారు. ఈ విషయాలు కొన్ని అధ్యయనాల ద్వారా వెల్లడయ్యాయి. కాబట్టి జీడిపప్పులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ బరువు తగ్గాలని అనుకొనే వారు మాత్రం బాదం పప్పు తినటమే బెటర్ ఆప్షన్ అని చెప్ప‌వ‌చ్చు.

Admin

Recent Posts