ప్ర‌శ్న - స‌మాధానం

Almonds : బాదంప‌ప్పుల‌ను అస‌లు రోజుకు ఎన్ని తినాలి..? త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యం..!

Almonds : బాదం అనేది అత్యంత విటమిన్స్‌ కలిగిన ఓ డ్రై ఫ్రూట్. ఇది శరీరానికి ఎంతో మేలు కలిగించే పోషక విలువలను అందిస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు దీన్నీ ఎంతో ఇష్టంగా తింటారు. బాదం పప్పులను రోజూ తినాలి కానీ కొంతమంది బాగున్నాయి కదా అని వాటిని రోజూ గుప్పెడు దాకా తినేస్తుంటారు. అలా మాత్రం తినకూడదు. రోజూ యావరేజ్‌గా 4 పప్పులు తినాలి. తద్వారా ఆరోగ్యం మెరుగవుతుంది. ముఖ్యంగా శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి.. స్లిమ్‌గా తయారవుతాం. ఒకవేళ శరీరంలో కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉంటే.. రోజుకు 20 నుంచి 30 బాదం పప్పులైనా తినాల్సిందే. ఫలితంగా వేడి బాగా పెరిగి.. కొవ్వు కరుగుతుంది.

మన జుట్టుకు కావాల్సిన అన్ని రకాల విటమిన్లూ, పోషకాలూ.. బాదంలో ఉంటాయి. ముఖ్యంగా జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా, దృఢంగా పెంచే మెగ్నీషియం, జింక్, విటమిన్ ఈ బాదంలో ఉంటాయి. అలాగే జుట్టును ఎక్కువ కాలం నిలిచివుండేలా చేసే విటమిన్ బి బాదంపప్పుల్లో ఉంటుంది. బాదంలో యాంటీఆక్సిడెంట్స్, నీటిలో కరిగే ఫ్యాట్స్, మెగ్నీషియం, కాపర్ వంటివి ఉంటాయి. ఇవి రక్త నాళాల్లో కొవ్వును తరిమికొడతాయి. ఫలితంగా రక్త సరఫరా బాగా జరుగుతుంది. అందువల్ల గుండె జబ్బులు దూరమవుతాయి. బాదంలను తొక్కతో సహా తినండి.. గుండె మరింత ఆరోగ్యంగా ఉంటుంది.

how many almonds we can eat per day

జుట్టు తెల్లబడిపోవడం, చర్మంపై ముడతల వంటివి వస్తుంటే.. మీరు తప్పనిసరిగా బాదం పప్పులు తినాల్సిందే. వాటిలోని మాంగనీస్, కొల్లాజెన్ అనే పదార్థం ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అది మన చర్మాన్ని కోమలంగా, అందంగా, ముడతలు లేకుండా చేస్తుంది. మన బాడీలో మంచి బ్యాక్టీరియా కూడా ఉంటాయి. అవి లేకపోతే మనం చనిపోతాం. కాబట్టి.. వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే. అందుకోసం బాదం పప్పులు తినాలి. ఎందుకంటే.. ఆ పప్పులపై ఉండే తొక్కలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. అవి మంచి బ్యాక్టీరియాను రెట్టింపు సంఖ్యలో పెరిగేలా చేస్తాయి.

Admin

Recent Posts