అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

బేరియాట్రిక్ స‌ర్జ‌రీతో డ‌యాబెటిస్‌కు ప‌రిష్కారం

డయాబెటీస్ వ్యాధితో బాధపడేవారికి బ్యారియాట్రిక్ సర్జరీతో నివారణ లభిస్తోంది. డయాబెటీస్ వ్యాధిపై జరిగిన ఒక సదస్సులో హైదరాబాద్ కు చెందిన ఎండోక్రినాలజిస్టు డా. కె.డి.మోడి ఈ విషయాన్ని వెల్లడించారు. సర్జరీ పొందిన వ్యాధిగ్రస్తులలో 70 శాతం వారికి షుగర్ లెవెల్స్ సాధారణ స్ధాయికి వచ్చినట్లు కనుగొనబడింది. వీరికి డయాబెటీస్ నుండి నివారణ లభించిందని అయితేమిగిలిన రోగులకు 10 శాతం మందులు వాడవలసివస్తోందని ఆయన తెలిపారు.

బ్యారియాట్రిక్ సర్జరీని బాడీ మాస్ ఇండెక్స్ 40 కిపైగా వుంటే చేయవచ్చునని తెలిపారు. అధిక బరువు కలిగి షుగర్ వ్యాధిబారిన పడిన వారికి బ్యారియాట్రిక్ సర్జరీ మంచి పరిష్కారం కాగలదని సదస్సు వివరాలను డెక్కన్ హెరాల్డ్ పత్రికలో ప్రచురించారు. నారాయణ హృదయాలయ హాస్పిటల్ కు చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగ అధినేత డా. కెన్నెత్ డి క్రజ్ మేరకు తాను చేసిన 20 మంది షుగర్ వ్యాధిగ్రస్తులకు బ్లడ్ షుగర్ స్ధాయి, సరిగ్గా వారం రోజులలో సాధారణ స్ధాయికి చేరినట్లుగా కూడా తెలిపారు.

bariatric surgery gives good results in diabetic people

ఆధునిక జీవన శైలి మారుతున్న కారణంగా డయాబెటీస్ వ్యాధి ఇపుడు 35 సంవత్సరాల వయసుకే వస్తోందని తాము చేస్తున్న సర్జరీలు 35 నుండి 55 సంవత్సరాల వయసు వారికి గరిష్ట లాభం చేకూరుస్తున్నాయని ఆయన తెలిపారు.

Admin

Recent Posts