ఉదయం లేవగానే చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అనేక మంది అయితే కాఫీ కాదు, ఉదయం లేవగానే టీ తాగేందుకే ఆసక్తిని చూపిస్తుంటారు. ఇక ఆ తరువాత రోజు మొత్తం మీద ఎన్ని సార్లు టీ తాగుతారో వారికే తెలియదు. అదేపనిగా కొందరు టీ తాగేస్తుంటారు. అయితే ఏదీ అతి పనికిరాదు. అలా అని చెప్పి టీ తాగడం పూర్తిగా మానేయరాదు. ఎందుకంటే.. టీ తాగడం వల్ల మనం ఎక్కువ కాలం బతుకుతామట. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
రోజూ కనీసం ఒక కప్పు టీ అయినా తాగితే మన ఆయుర్దాయం పెరుగుతుందట. ఈ క్రమంలో కొందరు 108 సంవత్సరాల పాటు కూడా జీవించే అవకాశం కూడా ఉంటుందట. అలాగే ఒక కప్పు పండ్ల రసం కన్నా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఒక కప్పు టీ లో ఉంటాయట. దీంతో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, ఒత్తిడి తగ్గుతుందని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. కనుక ఎవరైనా సరే నిత్యం కనీసం ఒక కప్పు టీ అయినా తాగాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
అయితే టీ తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి అదే పనిగా ఎక్కువ సార్లు టీ తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని సైంటిస్టులు చెబుతున్నారు. నిత్యం 2 కప్పులకు మించి టీ తాగకూడదని, అంతకు లోపు తాగితేనే పైన చెప్పిన లాభాలు కలుగుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక ఎవరైనా సరే.. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం 2 కప్పుల వరకు టీ తాగొచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు. మరి.. టీ బాగా తాగేవారు.. ఒక్కసారి ఆలోచించండి.. కాస్త మోతాదు తగ్గిస్తే.. ఆరోగ్యం మీ సొంతమవుతుంది..!