వ్యాయామం

క్రాబ్ వాకింగ్ అంటే ఏమిటో… దాంతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

వాకింగ్‌తో మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. హైబీపీ త‌గ్గుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. మాన‌సిక ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది. అలాగే ఇంకా ఎన్నో లాభాలు వాకింగ్ వ‌ల్ల మ‌న‌కు క‌లుగుతాయి. అయితే సాధార‌ణ వాకింగ్ క‌న్నా క్రాబ్ వాకింగ్ చేస్తే మ‌న‌కు ఇంకా ఎక్కువ ఉప‌యోగం ఉంటుంది. మరి క్రాబ్ వాకింగ్ ఎలా చేయాలో, దాంతో మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!

క్రాబ్ అంటే ఆంగ్లంలో ఎండ్ర‌కాయ అని అర్థం వ‌స్తుంది. కొంద‌రు దీన్ని పీత అని కూడా అంటారు. అయితే క్రాబ్ వాకింగ్ అంటే అచ్చం పీత‌లా పోజు పెట్టి న‌డ‌వాల‌న్న‌మాట‌. పైన చిత్రంలో చూపిన‌ట్లుగా ముందుగా నిటారుగా నిల‌బ‌డాలి. అనంతరం పొట్ట పైకి వ‌చ్చేట్లుగా వెల్ల‌కిలా వంగాలి. ఈ క్ర‌మంలో అర చేతుల‌ను పాదాల వైపు ఉంచాలి. క‌ళ్ల‌తో నేల‌ను చూడాలి. ఇలా భంగిమ పెట్టి వాకింగ్ చేయ‌డానే క్రాబ్ వాకింగ్ అంటారు. దీని వ‌ల్ల మ‌న‌కు బోలెడు లాభాలు క‌లుగుతాయి. అవేమిటంటే…

1. క్రాబ్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల పొట్ట‌, ఛాతి, తొడ‌లు, పిరుదుల వ‌ద్ద ఉన్న కొవ్వు సుల‌భంగా క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరం నాజూగ్గా త‌యార‌వుతుంది.

do you know what is crab walking exercise and its benefits

2. క్రాబ్ వాకింగ్ వ‌ల్ల గుండెకు మంచి వ్యాయామం అవుతుంది. గుండెకు ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. హైబీపీ త‌గ్గుతుంది.

3. క్రాబ్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శ‌రీరాన్ని చాలా సుల‌భంగా ఎలాంటి స్థితిలో అయినా బ్యాలెన్స్ చేయ‌వచ్చు. అంత సుల‌భంగా కింద ప‌డిపోకుండా ఉంటారు.

4. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి స‌మ‌స్య‌లు ఉన్న వారు క్రాబ్ వాకింగ్ చేస్తే ఆ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

5. క్రాబ్ వాకింగ్ వ‌ల్ల మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఏకాగ్ర‌త పెరుగుతుంది. డిప్రెష‌న్‌, ఒత్తిడి వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. మెద‌డు చురుగ్గా ప‌నిచేస్తుంది.

Admin

Recent Posts