మధ్యాహ్నం పూట అతిగా నిద్రించడం, ఆవులింతలు ఎక్కువగా రావడం, అలసి పోవడం, విసుగు.. వంటి లక్షణాలన్నీ.. మీరు తగినంత నిద్ర పోవడం లేదని తెలుపుతాయి. దీర్ఘకాలంలో అవే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చేలా చేస్తాయి. వాటి వల్ల అధికంగా బరువు పెరుగుతారు. గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఆయుష్షు తగ్గిపోతుంది. త్వరగా చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అయితే రాత్రి సరిగ్గా నిద్రపోని వారు మధ్యాహ్నం కొంత సేపు పడుకుంటే చాలులే. అదీ.. అదీ.. కవర్ అయిపోతాయి. అనుకుంటారు. కానీ రాత్రి నిద్ర రాత్రిదే, మధ్యాహ్నం నిద్ర.. అదే.. రెండూ వేర్వేరు. రాత్రి నిద్రించలేదని చెప్పి మధ్యాహ్నం నిద్రించినా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ విషయాన్ని సైంటిస్టులు తమ అధ్యయనాల ద్వారా వెల్లడించారు.
మిషిగన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు నిద్రపై చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. వాటిని స్లీప్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. రాత్రి నిద్ర పోలేదని, మధ్యాహ్నం 30 నుంచి 60 నిమిషాల పాటు నిద్ర పోతుంటారు. కానీ మధ్యాహ్నం నిద్ర వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని, నిద్రలేమి సమస్యను అతి తగ్గించలేదని చెబుతున్నారు.
రాత్రి నిద్ర పోలేదు కదా, మధ్యాహ్నం నిద్రపోతే చాలులే, కవర్ అవుతుంది, అని చాలా మంది అనుకుంటారు. కానీ మధ్యాహ్నం నిద్రతో ఎలాంటి ప్రయోజనం ఉండదని సైంటిస్టులు అంటున్నారు. అందువల్ల రాత్రి సరైన సమయానికి నిద్రించి ఉదయాన్నే నిద్ర లేవాలని, రోజుకు 7-8 గంటల పాటు నిద్ర పోవాలని అంటున్నారు.