శిలాజిత్ కు ఆయుర్వేదంలో కీలక పాత్ర ఉంది. దీన్ని అనేక రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. దీన్ని ఆయుర్వేద వైద్యులు నేరుగా కూడా ఇస్తుంటారు. అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో శిలాజిత్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే మహిళలకు దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. శిలాజిత్‌ను తీసుకోవడం వల్ల అలసట, బద్దకం తగ్గుతాయి. ఉత్సాహంగా ఉంటారు. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఎల్లప్పుడూ అలసటగా, నీరసంగా ఉందని భావించే మహిళలు శిలాజిత్‌ను వాడడం మంచిది.
2. మహిళలకు చర్మంపై సహజంగానే ముడతలు, మొటిమలు, మచ్చలు వస్తుంటాయి. కానీ శిలాజిత్‌ను వాడితే అవి తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు.
3. శిలాజిత్‌ను వాడడం వల్ల రుతు సమస్యలు తగ్గుతాయి. హార్మోన్లు సమతుల్యం అవుతాయి. దీంతో సంతానం కలిగే అవకాశాలు మెరుగు పడతాయి.
4. తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్న మహిళలు శిలాజిత్‌ను వాడితే మంచిది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
5. శిలాజిత్‌ను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు.
శిలాజిత్ క్యాప్సూల్స్ ను ఉదయం, సాయంత్రం ఒక్కో క్యాప్సూల్ చొప్పున తీసుకోవచ్చు. రోజుకు 250 ఎంజీ నుంచి 1000 ఎంజీ మోతాదులో వాడవచ్చు. వైద్యుల పర్యవేక్షణలో దీన్ని వాడాల్సి ఉంటుంది.