అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

నిద్ర మరీ ఎక్కువైనా లేదా త‌క్కువైనా ప్ర‌మాద‌మే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">శరీరానికి ఆహారం&comma; నీరు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం&period; నిద్రలేమి కారణంగా బరువు పెరగడం&comma; గుండె సమస్యలు&comma; టైప్‌-2 డయాబెటిస్‌&comma; ఇమ్యూనిటీ తగ్గడం&comma; ఒత్తిడి&comma; జుట్టు ఊడటం&comma; అరుగుదల సరిగా లేకపోవడం వంటి ఎన్నో సమస్యలొస్తాయి&period; నిద్ర ఆరోగ్యానికి మంచిదని కొంతమంది గంటల తరబడి నిద్రపోతూ ఉంటారు&period; నిద్ర తగ్గితేనే కాదు&comma; ఎక్కువైనా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు&period; జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ నివేదిక ప్రకారం&comma; ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల మీరు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారని వెల్లడించింది&period; ఎవరైనా&comma; ఎల్లప్పుడూ నిద్రపోవడానికి ఆవకాశం కోసం ఎదురు చూస్తుంటే&period;&period; కచ్చితంగా డాక్టర్‌‌‌ను సంప్రదించడం మంచిదని జాన్స్ హాప్‌కిన్స్ మెడిసిన్ ప్రొఫెసర్ Vsevolod Polotsky అన్నారు&period; నిద్ర సమయం ప్రతి వ్యక్తికీ మారవచ్చుసాధారణంగా పెద్ద వారికి రాత్రుళ్లు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరమవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొంతమంది సమయం దొరికితే చాలు&comma; తొమ్మిది గంటలకు మించి మరీ నిద్రపోతుంటారు&period; దీన్నే అతి నిద్ర&comma; హైపర్సోమ్నియా అంటారు&period; ఒకవేళ&comma; మీరు 9 గంటల కంటే ఎక్కువగా నిద్రపోతుంటే&period;&period; మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది&period; ఎక్కువగా నిద్రపోయిన&comma; నిద్ర తక్కువగా ఉన్నా&period;&period; బరువు పెరుగుతారు&period; ప్రతి రోజూ రాత్రి తొమ్మిది&comma; దాని కంటే ఎక్కువ నిద్రపోయే వ్యక్తులు&period;&period; ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య నిద్రపోయే వారి కంటే ఆరేళ్ల కాలంలో ఊబకాయానికి గురయ్యే అవకాశం 21&percnt; ఎక్కువగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది&period; ఎక్కువ గంటలు నిద్రపోవడం వల్ల&period;&period; రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది&comma; శరీరంలో ఇన్సులిన్‌‌ ఉత్పత్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు&period; దీని వల్ల డయాబెటిస్‌‌‌‌‌‌‌ వచ్చే ప్రమాదం ఉంది&period; ఎక్కువగా నిద్రపోయేవారిలో&period;&period; టైప్‌-2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం ఎక్కువని నిపుణులు అంటున్నారు&period; అతి నిద్రకు&comma; డిప్రెషన్‌కు సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-91256 size-full" src&equals;"http&colon;&sol;&sol;139&period;59&period;43&period;173&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;sleep-1-1&period;jpg" alt&equals;"over or less sleep two both are unhealthy " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలో 15&percnt; మంది ఎక్కువగా నిద్రపోతారని అంటున్నారు&period; అతి నిద్ర డిప్రెషన్‌ను తీవ్రతరం చేస్తుందని ప్రేర్కొంటున్నారు&period; డ్రిప్రెషన్‌ నుంచి బయటకు రావడానికి ఆరోగ్యకరమైన నిద్ర ముఖ్యం&period; అతినిద్ర వల్ల కూడా పలు మానసిక అనారోగ్యాలు సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు&period; రాత్రి సమయంలో ఎనిమిది గంటలు నిద్రపోయే స్త్రీల కంటే&period;&period; తొమ్మిది నుంచి 11 గంటలు నిద్రపోయే స్త్రీలకు కరోనరీ హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం 38&percnt; ఎక్కువగా ఉందని నర్సెస్‌ హెల్త్‌ సర్వే చెబుతోంది&period; ఈ అధ్యయనంలో దాదాపు 72&comma;000 మంది మహిళలను పరిశీలించారు&period; తొమ్మిది గంటలకు మించి నిద్ర పోవడం వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే ప్రమాదమూ 23 శాతం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు&period; అతి నిద్ర వల్ల మెదడుకు అందే రక్తప్రసరణపై ప్రతికూల ప్రభావం పడడమే ఇందుకు ప్రధాన కారణమ‌ని అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts