అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్నాయా ? ఈ ఎసెన్షియ‌ల్ ఆయిల్‌ను రోజూ వాడితే కొలెస్ట్రాల్ స‌హ‌జ సిద్ధంగా త‌గ్గుతుంది..!

భార‌త‌దేశంలో దాదాపుగా 80 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు అదికంగా ఉంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఒత్తిడి, హైబీపీ, స్థూల‌కాయం, గుండె స‌మ‌స్య‌లు, హైపో థైరాయిడిజం వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు స‌హజంగానే ఎక్కువ‌గా ఉంటాయి. ఇంకా శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, అధిక క్యాల‌రీలు ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతుంటాయి.

reduce cholesterol levels naturally by using lemon grass essential oil

జీవ‌న‌శైలిలో అనేక మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తిన‌డం, వ్యాయామం లేదా శారీర‌క శ్ర‌మ చేయ‌డం వ‌ల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. ఇక అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం ప‌లు ఎసెన్షియ‌ల్ ఆయిల్స్ ను వాడ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఇది పూర్తిగా సుర‌క్షిత‌మైన‌, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని విధానం. మందుల‌ను వాడ‌కుండానే కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది.

అరోమాథెర‌పీలో భాగంగా అనేక ర‌కాల ఎసెన్షియ‌ల్ ఆయిల్స్ ను వాడుతుంటారు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఆ ఎసెన్షియ‌ల్ ఆయిల్స్ లో లెమ‌న్‌గ్రాస్ ఎసెన్షియ‌ల్ ఆయిల్ ఒక‌టి. దీన్ని కిచెన్‌లో ఉప‌యోగిస్తారు. ప‌లు వంటల్లో వేస్తుంటారు. అయితే ఈ ఆయిల్ కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గిస్తుంది.

లెమ‌న్ గ్రాస్ ఆయిల్‌లో ట‌ర్పెనాయిడ్ స‌మ్మేళ‌నాలు ఉంటాయి. వాటిని గెరానియాల్‌, సిట్రాల్ అని పిలుస్తారు. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. మ‌న శ‌రీరంలో మెవ‌లోనిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ ను ఉత్ప‌త్తి చేస్తుంది. అయితే గెరానియాల్‌, సిట్రాల్ అనే స‌మ్మేళ‌నాలు మెవ‌లోనిక్ యాసిడ్‌ను అడ్డుకుంటాయి. దీంతో కొలెస్ట్రాల్ ఉత్ప‌త్తి కాదు. ఇలా కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపు చేయ‌వ‌చ్చు. వాటిని త‌గ్గించుకోవ‌చ్చు.

త‌ర‌చూ లెమ‌న్ గ్రాస్ ఆయిల్‌ను వాడ‌డం వ‌ల్ల వాటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి. ఈ వివ‌రాల‌ను సైంటిస్టులు త‌మ అధ్య‌య‌నాల్లో వెల్ల‌డించారు. అందువ‌ల్ల లెమ‌న్ గ్రాస్ ఆయిల్‌ను రోజూ వాడితే మంచిది.

రోజూ మీరు తాగే గ్రీన్ టీలో రెండు చుక్క‌ల లెమ‌న్ గ్రాస్ ఆయిల్‌ను క‌లిపి తాగ‌వ‌చ్చు. లేదా ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో స‌ద‌రు ఆయిల్‌ను 2 చుక్క‌లు క‌లిపి కూడా తీసుకోవ‌చ్చు. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. ఇక కొలెస్ట్రాల్ స్థాయిల‌ను తగ్గించ‌డంలో లావెండ‌ర్ ఆయిల్ కూడా ప‌నిచేస్తుంది. దీన్ని కూడా లెమ‌న్ గ్రాస్ ఆయిల్‌లా వాడుకోవ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts