రోజుకు 3 అరటి పండ్లను తీసుకోవడం ద్వారా గుండె పోటుకు చెక్ పెట్టవచ్చు. సైంటిస్టులు చేపట్టిన ఓ అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించారు. బ్రిటిష్-ఇటాలియన్ సైంటిస్టులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. నిత్యం 3 అరటి పండ్లను తింటే హార్ట్ ఎటాక్‌లు రావని, గుండె జబ్బులు రాకుండా ఉంటాయని నిర్దారించారు.
నిత్యం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సమయంలో ఒక అరటి పండు, మధ్యాహ్నం భోజనం సమయంలో ఒక అరటి పండు, రాత్రి భోజనం చేసేటప్పుడు మరొక అరటిపండు.. మొత్తం రోజుకు 3 అరటి పండ్లను తీసుకోవాలి. ఇలా తీసుకుంటే శరీరంలో పొటాషియం స్థాయిలు సరిగ్గా ఉంటాయి. దీంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. అలాగే మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు తగ్గించవచ్చని సైంటిస్టులు తెలిపారు.
ఇక నట్స్, పాలు, చేపలను కూడా నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండెపోటు, రక్తపోటు రాకుండా ఉంటాయని అన్నారు. పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను నిత్యం తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అయితే గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు, వచ్చిన వారు జాగ్రత్తగా ఉండేందుకు పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. కానీ పొటాషియం ఉన్న ఆహారాలను మరీ అధిక మోతాదులో కూడా తీసుకోరాదు. రోజుకు ఎంత అవసరం అయితే అంతే మోతాదులో వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు, గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365