అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

పురుషుల క‌న్నా స్త్రీల మెద‌డే షార్ప్‌గా ఉంటుంద‌ని తేల్చిన సైంటిస్టులు..!

మ‌న శ‌రీరానికి ఉండే వ‌య‌స్సు మాత్ర‌మే కాకుండా మన ఆరోగ్య స్థితి, వ్యాధులు, ఇత‌ర వివ‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే మ‌న బ‌యోలాజిక‌ల్ ఏజ్ కూడా ఒక‌టి ఉంటుంది తెలుసు క‌దా. అయితే ఇదే కాదు, ఇప్పుడు మ‌న మెద‌డుకు కూడా ఏజ్ ఉంటుంద‌ట‌. అంతేకాదు, మెద‌డు విష‌యంలో పురుషుల క‌న్నా స్త్రీల మెద‌డే య‌వ్వ‌నంగా ఉంటుంద‌ట. సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నంలో ఈ విష‌యం తెలిసింది.

అమెరికాకు చెందిన ప‌లువురు సైంటిస్టులు ఈ మ‌ధ్యే 121 మంది స్త్రీలు, 84 మంది పురుషుల‌పై అధ్య‌య‌నం చేశారు. వారి మెద‌డు మెట‌బాలిజం, మెద‌డుకు జ‌రుగుతున్న ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, మెద‌డు గ్లూకోజ్ వినియోగం త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించారు. దీంతోపాటు వారికి కొన్ని పజిల్స్ పెట్టారు. చివ‌ర‌కు సైంటిస్టులు ఏం తేల్చారంటే.. పురుషుల క‌న్నా స్త్రీల మెద‌డు షార్ప్‌గా ఉంటుంద‌ట‌. అలాగే స్త్రీ మెద‌డే పురుషుల మెద‌డు క‌న్నా య‌వ్వ‌నంగా ఉంటుంద‌ట‌. అంటే స్త్రీల అస‌లు వయ‌స్సు క‌న్నా వారి మెద‌డు వ‌య‌స్సు 3.8 ఏళ్లు త‌క్కువ‌గా ఉంటుంద‌ట‌. ఉదాహ‌ర‌ణ‌కు స్త్రీ వ‌య‌స్సు 30 సంవ‌త్స‌రాలు అనుకుంటే వారి మెద‌డు వ‌య‌స్సు 26.2 ఏళ్లే అన్న‌మాట.

scientists say that women mind is sharper than men

అలాగే పురుషుల అస్స‌లు వ‌య‌స్సు క‌న్నా వారి మెద‌డు వ‌య‌స్సు 2.4 సంవ‌త్స‌రాలు ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. ఉదాహ‌ర‌ణ‌కు పురుషుడి వ‌య‌స్సు 30 ఏళ్లు అనుకుంటే అత‌ని మెద‌డు వ‌య‌స్సు 32.4 సంవ‌త్స‌రాలు ఉంటుంద‌న్న‌మాట. అందువ‌ల్లే సాధార‌ణంగా వ‌య‌స్సు మీద ప‌డిన కొద్దీ మ‌తిమ‌రుపు, జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గిపోవ‌డంతోపాటు అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు పురుషుల‌కే ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే స్త్రీల‌కు వ‌య‌స్సు మీద ప‌డిన‌ప్ప‌టికీ వారి మెద‌డు వ‌యస్సు త‌క్కువ‌గా ఉంటుంది క‌నుక వారికి జ్ఞాప‌క‌శ‌క్తి, మెంట‌ల్ అల‌ర్ట్‌నెస్ ఎక్కువ‌గా ఉంటాయ‌ని, వారి మైండ్ షార్ప్‌గా ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా ఈ అధ్య‌య‌నానికి చెందిన వివ‌రాల‌ను అమెరికాకు చెందిన నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ అనే ఓ జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు.

Admin

Recent Posts