డ‌యాబెటిస్‌కు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్‌లకు మ‌ధ్య సంబంధం ఏమిటి ?

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేస్తున్న‌ వ్యాధులలో డయాబెటిస్ ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న వివ‌రాల ప్రకారం.. అధిక ఆదాయం ఉన్న‌ దేశాలతో పోలిస్తే, తక్కువ, మధ్యస్థ‌ ఆదాయం ఉన్న దేశాలలో ప్ర‌జ‌ల‌కు ఈ వ్యాధి ఎక్కువగా వ‌స్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలిలో మార్పులు అనే రెండు ముఖ్య అంశాలు మ‌ధుమేహాన్ని ప్ర‌భావితం చేస్తాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆహారంలో ప‌లు ర‌కాల పోష‌కాల‌తో డ‌యాబెటిస్‌కు లింక్ ఉంటుంద‌ని చెబుతున్నారు.

what is the relation between omega 3 fatty acids and diabetes

శరీరానికి అవసరమైన పోషకాలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒకటి. ఇవి వివిధ శారీరక విధులను నియంత్రించడంలో సహాయపడుతాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కంటి చూపు మెరుగుప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. గుండె ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. అయితే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు చేస్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. అలాగే డ‌యాబెటిస్ ఉన్న‌వారిలో ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరుగుతుంది. అంటే శ‌రీరం ఇన్సులిన్‌ను స‌రిగ్గా ఉప‌యోగించుకుంటుంది. దీంతో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ విష‌యాన్ని హార్వార్డ్ ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవాల‌ని వారు సూచిస్తున్నారు.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా న‌ట్స్‌, విత్త‌నాలు, చేప‌లు, అవ‌కాడో, పాల‌కూర‌, కోడిగుడ్లు త‌దిత‌ర ఆహారాల్లో ఉంటాయి. ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు. క‌నుక శ‌రీరానికి మేలు చేస్తాయి. డ‌యాబెటిస్‌ను అదుపు చేసేందుకు స‌హాయ ప‌డ‌తాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts