బిర్యానీ ఆకు.. దీన్నే తేజ్ పత్తా అని పిలుస్తారు. భారతీయులు ఎంతో కాలం నుంచి ఈ ఆకులను తమ వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఈ ఆకులు చక్కని సువాసనను అందిస్తాయి. వంటల్లో వేయడం వల్ల చక్కని రుచి, వాసన వస్తాయి. బిర్యానీలు, దాల్ మఖని, కూరలు, పులావ్‌లు వంటి వాటిలో ఈ ఆకులను ఎక్కువగా వేస్తుంటారు. అయితే ఈ ఆకుల వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి.
తేజ్‌పత్తా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం తదితర పోషకాలు ఉంటాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఆకలి లేని వారికి ఆకలి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
1. తేజ్ పత్తా ఆకులతో చేసిన టీ ని రోజూ తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారిలో చక్కెర స్థాయిలు తగ్గడమే కాక, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. ఆ వివరాలను క్లినికల్ బయో కెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్ జర్నల్‌లో 2009లో ప్రచురించారు.
2. తేజ్ పత్తా ఆకులు జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. మలబద్దకం తగ్గుతుంది.
3. తేజ్ పత్తా ఆకులు గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఈ ఆకుల్లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హైబీపీని తగ్గిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
4. బిర్యానీ ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.
5. ఈ ఆకులతో చేసిన టీ ని తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
6. ఒత్తిడి, ఆందోళన, ఇతర మానసిక సమస్యలతో సతమతం అయ్యేవారు ఈ ఆకులతో చేసిన టీ తాగితే ఫలితం ఉంటుంది.
7. ఈ ఆకులతో చేసిన టీని తాగితే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. శరీరంలో వాపులు తగ్గుతాయి.
ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. నీరు బాగా మరిగాక అందులో తేజ్ పత్తా ఆకులు, దాల్చిన చెక్క పొడి వేసి మళ్లీ 10 నిమిషాల పాటు మరిగించాలి. స్టవ్ ఆర్పి ఆ మిశ్రమాన్ని వడకట్టాలి. అందులో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి. దీన్ని రోజూ ఉదయాన్నే తాగితే పైన తెలిపిన ఫలితాలు కలుగుతాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365