అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

మ‌హిళ‌లు రోజూ కాఫీ తాగితే స్ట్రోక్ రాకుండా అడ్డుకోవ‌చ్చ‌ట‌..!

సాధారణంగా మహిళలు ఉదయంపూట లేవగానే ఒకసారి, తమ ఉదయపు పనిపాటలు అయిన తర్వాత మరో సారి రెండు కప్పుల కాఫీ తాగుతూనే వుంటారు. అయితే గతంలో చేసిన అద్యయనాలు మహిళలు రోజుకు రెండు కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని కూడా చెప్పాయి.

స్త్రీల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే రోజూ రెండు కప్పుల కాఫీ తప్పనిసరి అని తాజాగా నిర్వహించిన మరో అధ్యయనం కూడా తేల్చింది. కాఫీని సేవించడం ద్వారా స్ట్రోక్ వచ్చే ప్రమాదం 22-25 శాతం వరకు ఆడవారిలో తగ్గిందని స్వీడన్ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలో తేలింది. ముఖ్యంగా గుండె అనారోగ్య ఫలితంగా వచ్చే పక్షవాతం వంటివి కూడా కాఫీ తాగడం వల్ల దూరమవుతాయని పరిశోధకులు తెలిపారు.

women who drink coffee daily can prevent strokes

దాదాపు 39 వేల మందికి పైగా మహిళల మీద పదిన్నర సంవత్సరాల పాటు ఈ పరిశోధనను నిర్వహించారు. కాఫీ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడటంతో పాటు ఆక్సిడటివ్ అంశం తగ్గుతుంది. ఇన్‌‌ఫ్లమేషన్ తగ్గుతుంది. ఈ కారణాల వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం తగ్గుతుందని పరిశోధకులు తెలిపారు.

Admin

Recent Posts