Teeth Gaps : జ్యోతిష్య శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే దీని పరిధి చాలా పెద్దది. ప్రతి విషయం ఆధారంగా కూడా మనుషుల జాతకాలను తెలుసుకోవచ్చు. ఇక పండితులు పరిశోధనలు చేసి కొత్త కొత్త విషయాలను ఎప్పుడూ చెబుతుంటారు. వాస్తవానికి జోతిష్యం అనేది మన పురాణాల్లో కూడా ఉంది. రాజుల కాలంలో కూడా సంతానం కలగగానే ముందుగా చేసే పని జాతకాలు చూడడం. పేరు పెట్టడానికి ముందే జాతకాలు చూసి దాని ప్రకారం మసులుకునే వారు. అలాగే ప్రస్తుత కాలంలో వివిధ రకాల జోతిష్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో దంత జోతిష్యం కూడా ఒకటి. ఈ జోతిష్యంలో ముందు రెండు పెద్ద దంతాల మధ్య సందు ఉంటే మీరు అదృష్ట వంతులని శాస్త్రం కూడా చెబుతుంది. చేతిలో గీతలను చూసి భవిష్యత్తు తెలుసుకున్నట్టు ఈ దంతాల మధ్య సందును చూసి కూడా మన భవిష్యత్తును తెలుసుకోవచ్చు.
అందులో ముఖ్యమైనది ముందు దంతాల వరుసలో ఉన్న కాలి. అది కూడా రెండు పెద్ద దంతాల మధ్య ఉండే కాలి. దంతాల కాలి ఉంది కదా అని వాటిని దగ్గరగా చేయడం అనవసరం. దంతాల మధ్య కాలిని పూడ్చుకుంటే ఎదురు వచ్చే అదృష్టాన్ని చేజేతుల పోగొట్టుకున్నట్టేనని పండితులు చెబుతున్నారు. వారి స్వభావం ఎటువంటిది, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, చిత్ర ఎటువంటిది అనే విషయాలను ఈ దంత శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక ముందు రెండు పెద్ద దంతాల మధ్య కాలి ఉన్న వారు కెరీర్ లో దూసుకుపోతారు. డబ్బును బాగా సంపాదిస్తారు. వీళ్లు ఒకసారి ఓడినా కూడా గెలిచే వరకు పోరాడుతూనే ఉంటారు. వీళ్లు అతితెలివైన వాళ్లు. ఇలా దంతాల మధ్య కాలి ఉండేవారు ధనవంతులు అయ్యే అవకాశం ఉంది.
వీళ్లు అధిక మాటకారులు కూడా. చాలా సులభంగా ఎదుటి వారిని వాళ్ల మాటలతో ఆకట్టుకుంటారు. అలాగే భోజన ప్రియులు కూడా. వీళ్లు ఎక్కువగా తింటారు. జీవితాన్ని అన్ని విధాలుగా ఆస్వాదిస్తారు. చిన్న చిన్న సమస్యలు వచ్చిన తెలివిగా ముందడుగు వేస్తారు తప్ప వెనుకడుగు వేసి పారిపోరు. ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో వీళ్లు సిద్దహస్తులు. ఇక దంతాల మధ్య కాలి స్త్రీలల్లో వస్తే ఇంకా అదృష్టవంతులు. పురుషుల కంటే స్త్రీలు మరింత అదృష్ట వంతులు అవుతారని జోతిష్య పండితులు చెబుతున్నారు. ఒక వీళ్లు ఎంత సంపాదించిన కూడా ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇతరుల కంటే దంతాల మధ్య కాలి ఉన్నవారికి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఈ శాస్త్రం ప్రకారం పన్ను మీద పన్ను ఉన్న వారికి కూడా అదృష్టం బాగా కలిసివస్తుంది. వీళ్లు కూడా అందం కోసం దానిని తీసివేయకూడదు.