Dandruff : మనల్ని ఇబ్బంది పెట్టే జుట్టు సంబంధిత సమస్యల్లో చుండ్రు ఒకటి. దీని కారణంగా మనలో చాలా మంది ఇబ్బందులకు గురి అవుతున్నారు. చలికాలంలో ఈ చుండ్రు సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చుండ్రు కారణంగా తలలో దురద ఎక్కువగా ఉంటుంది. ఈ చుండ్రు మనకు తెలియకుండానే వస్తుంది. మొదటి దశలో ఉన్నప్పుడే దీనిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చుండ్రే కదా అని నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రమై జుట్టు కూడా రాలిపోతుంది. తల పైభాగం కూడా వికారంగా మారుతుంది. ఈ సమస్యను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
ఈ సమస్య నుండి బయట పడడానికి చాలా మంది యాంటీ డాన్ డ్రఫ్ షాంపులను వాడుతూ ఉంటారు. వీటిని వాడడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. వంటింట్లో ఉండే పదార్థాలతోనే మనం చుండ్రును తగ్గించుకోవచ్చు. చుండ్రు సమస్యను తగ్గించే తేలికైన, అనువైన పద్దతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వంటసోడాను ఉపయోగించి మనం చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. వంటసోడా యొక్క ఆల్కలైన్ స్వభావం చర్మం ఉండే మృత కణాలను తొలగిస్తుంది. అలిగే చర్మం నుండి నూనె ఎక్కువగా ఉత్పత్తి కాకుండా చేస్తుంది. ముందుగా ఒక గిన్నెలో వంటసోడాను తీసుకోవాలి. తరువాత అందులో నీటి చుక్కలను వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మర్దనా చేయాలి. అర గంట తరువాత నీటితో కడగాలి.
ఇలా తరచూ చేయడం వల్ల చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు. జుట్టులోని పొడిదనాన్ని, చుండ్రును తొలగించడంలో ఆలివ్ నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ నూనెను జుట్టుకు పట్టించి మర్దనా చేయాలి. తరువాత జుట్టును టవల్ తో ముడివేయాలి. అరగంట శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చుండ్రతో బాధపడే వారు కలబంద గుజ్జులో ఉల్లిపాయ రసాన్ని కలిపి తలకు పట్టించి మర్దనా చేయాలి. ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఈ చిట్కాను పాటించడం వల్ల చుండ్రుతో పాటు దురద కూడా తగ్గుతుంది. రెండు టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని మెత్తని పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. దాదాపు అరగంట పాటు తలను ఆరనిచ్చి తరువాత తలస్నానం చేయాలి.
అదే విధంగా నిమ్మరసంలో కొబ్బరి నూనెను కలిపి తలకు పట్టించాలి. వెంట్రుకలను ఆవిరిలో ఉంచి దాదాపు రెండు గంటల పాటు ఆరనివ్వాలి. తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల చుండ్రు సమస్య నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. వీటిని పాటిస్తూనే మంచి నీటిని ఎక్కువగా తాగాలి. సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. బి విటమిన్స్ , జింక్ ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ చిట్కాలను పాటించడం వల్ల చుండ్రు సమస్య తగ్గడంతో పాటు మన దరి చేరకుండా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు కూడా కాంతివంతంగా తయారవుతుంది.