sports

ఒక దేశంలో పుట్టి మరో దేశానికి ఆడుతున్న టాప్ 10 క్రికెటర్స్..!

ప్రపంచ దేశాల్లో చాలా దేశాల ప్రజలు క్రికెట్ అంటే చాలా ఇష్టపడతారు.. అలాగే క్రికెటర్స్ ని ఎక్కడికి వెళ్లిన గుర్తుపడతారు. అంతటి ఆదరణ గుర్తింపు సంపాదించుకున్న చాలా మంది క్రికెటర్లు ఉన్నారు.. ఈ క్రికెటర్లు ఏ దేశంలో పుట్టిన వారైతే ఆ దేశం తరఫున ఆడతారు.. కానీ కొంతమంది క్రికెటర్లు ఒక దేశంలో పుట్టి మరో దేశానికి ఆడుతున్నారు.. వారెవరో ఒకసారి చూద్దాం.. క్రిస్ జోర్డాన్: వెస్టిండీస్ లో పుట్టిన ఈ క్రికెటర్ ఇంగ్లాండ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈయన 1988 అక్టోబర్ 4న క్రైస్ట్ చర్చ్ బార్బడోస్ లో జన్మించాడు. సికిందర్ రాజా: ఈయన పాకిస్తాన్ లో పుట్టి జింబాబ్వేకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 1986 ఏప్రిల్ 24న సియాల్కోట్ పాకిస్తాన్ లో జన్మించాడు.

ఉస్మాన్ ఖావజా : పాకిస్తాన్ లో జన్మించిన ఈ క్రికెటర్ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈయన పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో జన్మించాడు. జాసన్ రాయ్ : దక్షిణాఫ్రికాలో జన్మించి ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నాడు. ఇతను డర్బన్ అనే ప్రాంతంలో జన్మించాడు. ఆండ్రూ సైమండ్స్ : ఈ క్రికెటర్ యూకేలో జన్మించి ఆస్ట్రేలియా తరఫున ఆడాడు. ఇతను ఇంగ్లాండులోని బర్మింగ్హామ్ లో జన్మించాడు. ఇమ్రాన్ తాహిర్ : పాకిస్తాన్ లో పుట్టిన ఈ క్రికెటర్ ఇంగ్లాండు కౌంటీలు ఆడి, తర్వాత దక్షిణాఫ్రికాకు ఆడారు. ఇతను పాకిస్తాన్లోని లాహోర్లో జన్మించాడు.

these cricketers born in one country and playing for others

బెన్ స్టోక్స్ : న్యూజిలాండ్ లో పుట్టిన ఇతను ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నాడు. ఇతను క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలో జన్మించాడు. జోఫ్రా ఆర్చర్ : వెస్టిండీస్ లో పుట్టిన ఇతను ఇంగ్లాండ్ తరఫున ఆడుతున్నాడు. ఇతడు బ్రిడ్జిటౌన్ బార్బడోస్ లో జన్మించాడు. ఇయాన్ మోర్గాన్: ఇతడు ఐర్లాండ్ లో పుట్టి ఇంగ్లాండ్ తరఫున ఆడాడు. కెవిన్ పీటర్సన్: ఈ క్రికెటర్ దక్షిణాఫ్రికాలో పుట్టి ఇంగ్లండ్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. పీటర్స‌న్‌ మారిడ్జ్ బర్గ్ లో జన్మించాడు.

Admin

Recent Posts