ప్రతీ ఒక్కరు కూడా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ లో చాలా యాప్స్ ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. ఈ యాప్స్ వలన చాలా టాస్కులని ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. అయితే, వీటిని గమనించినట్లయితే ఇవి మన డేటాని ఫాలో అవుతూ ఉంటాయి. అలా ఫాలో అయ్యే యాప్స్ చాలా ఉన్నాయి. మన ఫోన్ నుంచి వాటిని తీసేసినా సరే అవి మన డేటాని ట్రాక్ చేయడానికి అనుమతి ఉంటుంది.
అలాంటి పరిస్థితుల్లో అవి మన డేటాని చూస్తూ ఉంటాయి. అయితే ముందు మీరు ఏం చేస్తారు అంటే.. మీ ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్లి, ‘గూగుల్ సర్వీస్’ అనే దానిని సెర్చ్ చేయండి. అక్కడ ‘ మ్యానేజ్ యువర్ గూగుల్ అకౌంట్’ అని ఉంటుంది. దానిని ఓపెన్ చేయండి. ఆ తర్వాత ‘క్లిక్ ఆన్ డేటా అండ్ ప్రైవసీ’ పై క్లిక్ చేయండి.
ఇలా చేసిన తర్వాత కొంచెం కిందకు వస్తే ‘థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్’ అనేది కనబడుతుంది. ఇక్కడ మీరు ఏ యాప్స్ కి మీ డేటాని చూడడానికి అవకాశాన్ని ఇచ్చారనేది కనపడుతుంది. ఇప్పుడు మీరు వేటికైతే పర్మిషన్ ఇవ్వకూడదు అనుకుంటున్నారో వాటిని తీసేయండి. ఇలా యాక్సిస్ ని తొలగించుకోవచ్చు. లేదంటే మీ డేటా ని యాప్స్ అన్ని కూడా చూస్తూ ఉంటాయి.