ప్రస్తుత తరుణంలో స్మార్ట్ ఫోన్లు అనేవి కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఫోన్ అయితే కచ్చితంగా ఉంటోంది. చాలా మంది స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు విలాసవంతమైన వస్తువుగా ఉండే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు నిత్య అవసరంగా మారింది. అయితే అంతా బాగానే ఉంది కానీ స్మార్ట్ ఫోన్ విషయంలో కొందరు తప్పులు చేస్తుంటారు. దీంతో ఫోన్ బ్యాటరీ త్వరగా పాడవుతుంది. ఇక ఆ తప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది ఫోన్‌కు చార్జింగ్ పెట్టిన అనంతరం చార్జర్‌ను సాకెట్‌లో అలాగే ఉంచి స్విచాన్‌లో ఉంచి పెడతారు. మళ్లీ చార్జింగ్ కావల్సి వచ్చినప్పుడు కేబుల్‌ను ఫోన్‌కు పెడతారు. ఇలా చేయడం వల్ల చార్జర్ పనితనం దెబ్బతింటుంది. చార్జింగ్ పెట్టని సమయంలో చార్జర్‌ను సాకెట్ నుంచి తీయాలి. లేదా కనీసం స్విచ్‌ను ఆఫ్ అయినా చేయాలి. ఇలా చేస్తే బ్యాటరీకి పవర్ సరిగ్గా వస్తుంది. బ్యాటరీ పాడవకుండా ఉంటుంది. అలాగే చాలా మంది ఫోన్‌ను 100 శాతం చార్జింగ్ అయ్యే వరకు ఉంచుతారు. అలా ఉంచకూడదు. ఫోన్‌లో చార్జింగ్ 20 నుంచి 80 శాతం మధ్య ఉండేలా చూసుకుంటే చాలు. 100 శాతం చార్జింగ్ పదే పదే పెడుతుంటే బ్యాటరీకి ఉండే పవర్ సైకిల్స్ తగ్గిపోతాయి. దీంతో బ్యాటరీ సామర్థ్యం త్వరగా తగ్గిపోతుంది. బ్యాటరీని త్వరగా మార్చాల్సి వస్తుంది. కనుక ఫోన్‌కు చార్జింగ్ ఎప్పుడూ కూడా 100 శాతం పెట్టకూడదు.
చాలా మంది ఫోన్ బ్యాటరీ 0 అయ్యే వరకు ఉంచుతారు. అలా ఉంచినా కూడా నష్టమే జరుగుతుంది. దీంతో కూడా ఫోన్ బ్యాటరీ సైకిల్స్ తగ్గుతాయి. ఫోన్ బ్యాటరీ 20 నుంచి 80 శాతం మధ్యలో ఉంటే మంచిది. అలాగే కొందరు ఫోన్‌ను రాత్రి పూట మొత్తం చార్జింగ్ పెడతారు. ఇలా చార్జింగ్ చేయడం వల్ల ఫోన్ పేలే ప్రమాదం ఉంటుంది. దీంతోపాటు బ్యాటరీ నాణ్యత, మన్నిక కూడా తగ్గుతాయి. బ్యాటరీని త్వరగా మార్చాల్సి వస్తుంది. అలాగే చాలా మంది తక్కువ ధరకు వస్తాయని చీప్ చార్జర్లను ఫోన్‌కు చార్జింగ్ పెట్టేందుకు వాడుతారు. ఇలా వాడినా కూడా ఫోన్ బ్యాటరీపై ప్రభావం పడుతుంది. దీంతో బ్యాటరీ పాడవుతుంది. కనుక ఫోన్లను వాడేవారు ఈ తప్పులను చేయకండి. లేదంటే బ్యాటరీని త్వరగా మార్చాల్సి వస్తుంది.