దానిమ్మ పండ్లను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దానిమ్మ పండ్లలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందువల్ల వాటిని తింటే మనకు పోషణ, శక్తి రెండూ లభిస్తాయి. అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అయితే దానిమ్మ చెట్టుకు చెందిన ఆకులు మనకు బాగా ఉపయోగపడుతాయి. వాటితో ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
1. దానిమ్మ చెట్టు ఆకులను కొన్నింటిని తీసుకుని బాగా కడిగి వాటిని నీటిలో బాగా మరిగించాలి. అనంతరం ఆ నీటిని ఒక కప్పు మోతాదులో రోజుకు రెండు సార్లు తాగాలి. దీంతో దగ్గు, జలుబు తగ్గుతాయి.
2. ఒక పాత్రలో 200 ఎంఎల్ నీటిని తీసుకుని అందులో 3 గ్రాముల దానిమ్మ ఆకుల పేస్ట్‌ను వేసి బాగా మరిగించాలి. నీరు 50 ఎంఎల్ అయ్యే వరకు మరిగించాక దాన్ని నిద్రకు ముందు తాగాలి. దీంతో నిద్ర బాగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
3. దానిమ్మ చెట్టు ఆకులను పేస్ట్‌లా చేసి రాస్తుంటే గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుతాయి. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులను తగ్గించుకోవచ్చు.
4. దానిమ్మ ఆకుల పేస్ట్‌ను మొటిమలపై రాస్తుంటే మొటిమలు త్వరగా తగ్గిపోతాయి.
5. దానిమ్మ ఆకులను నూరి మిశ్రమంగా చేసి రసం తీయాలి. అందులో నువ్వులు లేదా ఆవ నూనె కలపాలి. ఆ మిశ్రమాన్ని రెండు చుక్కల చొప్పున చెవుల్లో వేస్తుండాలి. దీంతో చెవి నొప్పి, ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
6. దానిమ్మ ఆకుల నుంచి జ్యూస్ తీసి తాగుతుంటే అజీర్ణం, మలబద్దకం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు తగ్గుతాయి. జ్యూస్‌ను 1 లేదా 2 టీస్పూన్ల మోతాదులో రోజుకు 2 సార్లు తాగవచ్చు.
7. దానిమ్మ ఆకుల రసాన్ని నీటిలో కలిపి ఆ నీటితో పుక్కిలిస్తుండాలి. దీంతో దంతాలు, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో ఉండే పుండ్లు, పొక్కులు తగ్గుతాయి.