One Rupee Under Pillow : చాలామంది, వాస్తు ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడుతుంటారు. వాస్తు ప్రకారం పాటిస్తే, ఎన్నో మార్పులు జరుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ తొలగి, పాజిటివ్ ఎనర్జీ ని కూడా పొందవచ్చు. చాలామంది, డబ్బు విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సంపాదించిన డబ్బు ఇంటికి వస్తుంది కానీ, వెంటనే ఖర్చు అయిపోతుంది. రెండు రోజులు కూడా లేకుండానే డబ్బులు మొత్తం పూర్తయిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా, ఈ రోజుల్లో ఫుల్లుగా బిజీగా ఉంటున్నారు.
కేవలం రాత్రి మాత్రమే విశ్రాంతి తీసుకుంటున్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వాస్తు బాగా ఉపయోగపడుతుంది. రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం వంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. చెడు కలలతో బాధపడే వాళ్ళు, చెడు కలలను దూరం చేసుకోవడానికి, కత్తిని దిండు కింద పెట్టుకుని, నిద్రపోతే మంచిది. ఇలా చేయడం వలన మనశ్శాంతి కలుగుతుంది. కత్తిని దిండు కింద పెట్టుకొని, నిద్రపోవడం వలన చక్కటి నిద్ర ని పొందవచ్చు.
ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్న వాళ్లు, బెడ్ రూమ్లో సువాసనతో కూడిన కొవ్వొత్తులు వెలిగించండి. ఇవి మంచి ప్రశాంతకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. నిద్ర కూడా బాగా పడుతుంది. గాఢనిద్రని పొందవచ్చు. భగవద్గీత ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ని ఇస్తుంది. పడకగదిలో దిండు కింద భగవద్గీత ని పెట్టుకుంటే, మంచి నిద్ర కలుగుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి దిండు కింద యాలకులు పెట్టుకుని నిద్రపోతే కూడా, ప్రశాంతత కలుగుతుంది. గాఢ నిద్ర కూడా పడుతుంది.
ఆరోగ్యం మెరుగుపడాలంటే, రాత్రి పూట ఒక బాటిల్ లో సోంపు వేసి నీళ్లు పోసి దిండు కింద పెట్టుకుంటే, ప్రశాంతకరమైన నిద్రని పొందవచ్చు. రాహు దోష నివారణకి సోంపును దిండు కింద పెట్టుకొని, నిద్రపోతే ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. అలానే, పాజిటివ్ వెనర్షి కలగాలంటే వెల్లుల్లి రెబ్బలు తీసుకుని, దిండు కింద పెట్టుకుని నిద్రపోండి. సానుకూల శక్తిని ఇది ఆకర్షిస్తుంది. మంచి నిద్ర వస్తుంది. ఇలా వీటిని కనుక మీరు పాటించినట్లయితే, మంచి నిద్రని పొందవచ్చు.