చాలా మంది తమ ఇళ్లల్లో అలంకరణ వస్తువుగా నెమలి ఫించం పెట్టుకొని ఉంటారు. అయితే ఈ విధంగా ఇంట్లో నెమలి ఫించం పెట్టుకోవటం వల్ల మంచి జరుగుతుందని కొందరు భావించినప్పటికీ వీటిని ఇంటిలో ఉంచుకోకూడదు మరి కొందరు భావిస్తుంటారు. అయితే నెమలి ఫించం ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వాటి వల్ల కలిగే లాభ నష్టాలు ఏమిటి? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
నెమలి ఫించం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎంతో ఇష్టం. అదేవిధంగా నెమలి ఫించం చాలామంది చిన్నప్పుడు పుస్తకాలలో పెట్టుకొని దాచుకుంటారు. ఈ విధంగా చేయడం వల్ల వారికి సరస్వతి భాగ్యం కలుగుతుందని భావిస్తారు. నెమలి ఫించం ఇంట్లో ఉండటం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
సోమవారం పూట ఎనిమిది నెమలి ఫించంలని తీసుకొని వాటిని చిన్నగా దారంతో కట్టి దేవుని గదిలో దేవుడి దగ్గర విసురుతూ..ఓం సోమాయ నమః అని చెప్పండి. ఇలా మీరు దేవుడిని పూజించడం వల్ల మంచి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు దేవుడికి ఈ విధంగా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అదే విధంగా మూడు నెమలి ఫించంలను మన ఇంట్లో డబ్బులు దాచే చోట పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలు లేకుండా అష్టైశ్వర్యాలను మనకు కలుగజేస్తాయి. కనుక నెమలి ఫించం ఇంట్లో ఉంచటం వల్ల ఎటువంటి సమస్యలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు.