ఫెంగ్‌షుయ్… వాస్తును పాటించే వారందరికీ దీని గురించి తెలుసు. ఇది కూడా ఓ వాస్తు శాస్త్రమే. చదువు, కెరీర్, వ్యక్తిగత జీవితం, నాలెడ్జ్ వంటి ఎన్నో అంశాలను ఈ వాస్తు ప్రభావితం చేస్తుంది. వ్యాపారమైనా, ఉద్యోగమైనా అందులో వృద్ధి సాధించాలంటే ఈ వాస్తు ఉపయోగపడుతుంది. అయితే ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వాస్తు ప్రకారం లక్ కూడా కలసి రావాలి. అలా కలసి వస్తేనే అదృష్టం తగులుతుంది. దీంతో వ్యాపారమైనా, ఉద్యోగమైనా వృద్ధిలోకి వస్తుంది. ఈ క్రమంలో అలా ఎవరైనా వృద్ధిలోకి రావాలంటే ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఫెంగ్ షుయ్ ప్రకారం గుర్రాలు శక్తికి నిదర్శనాలు. ఇవి పాజిటివ్ శక్తిని ఇస్తాయి. ఈ క్రమంలో గుర్రాల బొమ్మలను ఇల్లు లేదా ఆఫీస్‌లో పెట్టుకుంటే తద్వారా పైన చెప్పిన విధంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో వృద్ధి సాధించవచ్చు.
పగ్గాలతో ఉండే గుర్రపు బొమ్మలను మాత్రమే పెట్టాలి. ఒంటిపైన ఏమీ లేని ఖాళీ గుర్రపు బొమ్మలను పెట్టరాదు. పెడితే అవి నెగెటివ్ ఎనర్జీకి సంకేతాలు కనుక అదే ఎనర్జీ ప్రసారమవుతుంది. దీంతో అదృష్టం కలసి రాదు. కనుక పగ్గాలు లేదా జీనుతో ఉండే గుర్రపు బొమ్మలనే పెట్టాల్సి ఉంటుంది. దీంతో లక్ కలసి వచ్చి అంతా మంచే జరుగుతుంది. అన్నింటా వృద్ధిలోకి వస్తారు. సంపదలు కలుగుతాయి. ఇల్లు లేదా ఆఫీసులో దక్షిణ దిశలో గుర్రపు బొమ్మను ఉంచితే దాంతో పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి. బిజినెస్‌లో చేపట్టే ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉత్తర దిశలో గుర్రపు బొమ్మను ఉంచితే కెరీర్ పరంగా సెట్ అవుతారు. ఆ సమస్యలు ఎదుర్కొనేవారు, ఆర్థిక సమస్యలు ఉన్న వారు గుర్రపు బొమ్మను ఉత్తర దిశలో పెట్టాలి. దీంతో లక్ కూడా కలసి వచ్చి అనుకున్న పనులు నెరవేరుతాయి.
తలుపులు లేదా కిటికీలకు ఎదురుగా గుర్రపు బొమ్మ తల వచ్చేలా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. రెండు జంట గుర్రపు బొమ్మలను బెడ్ రూంలో పెట్టుకుంటే దంపతుల మధ్య కలహాలు ఉండవు. గొడవలు లేని కాపురంతో వారు సుఖంగా జీవిస్తారు. బెడ్‌రూంలలో ఎప్పుడు ఒంటరి గుర్రపు బొమ్మలను పెట్టరాదు. జంట గుర్రపు బొమ్మలనే పెట్టుకోవాలి. గుర్రపు బొమ్మనే పెట్టుకోవాల్సిన పనిలేదు. గుర్రం ఫొటోను ఇల్లు లేదా ఆఫీస్ లో వేలాడదీసినా పైన చెప్పిన ఫలితాలు కలుగుతాయి. ఏడు గుర్రాలు పక్క పక్కనే పరిగెడుతున్నట్టుగా ఉండే ఫొటో లేదా విగ్రహాన్ని పెట్టుకుంటే చాలా మంచిదట. దీంతో ఇల్లు లేదా ఆఫీస్‌లో ఉండే నెగెటివ్ ఎనర్జీ మొత్తం పోతుందట. సమస్యలు ఏవైనా ఉంటే ఇట్టే పరిష్కారం అయిపోతాయట.