vastu

ఇంట్లో శంఖువును ఇలా పెట్టుకోండి.. పట్టిందల్లా బంగారమే అవుతుంది..!

సాధారణంగా హిందువులు శంఖాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ క్రమంలోనే శంఖాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించడం ద్వారా సాక్షాత్తు లక్ష్మీ దేవి కొలువై ఉంటుందని భావిస్తారు. అందుకే కొందరు శంఖాన్ని పూజ గదిలో పెట్టుకొని పూజలు చేస్తారు. అయితే శంఖాన్ని కొనుగోలు చేసేవారు ఒక శంఖాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు. కానీ శంఖం కొనేటప్పుడు తప్పకుండా రెండు శంఖాలు కొనాలని పండితులు చెబుతున్నారు.

ఒక శంఖాన్ని నీటి శంఖం అని పిలుస్తారు. ఈ శంఖం పూజకు ఎంతో పవిత్రమైనది. ఈ శంఖాన్ని దేవుడి గదిలో ఎర్రని వస్త్రంపై ఉంచి విష్ణుమూర్తి పాదాల చెంత పెట్టి పూజించాలి. ఈ నీటి శంఖంలో ఎల్లప్పుడూ నీరు ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా నీటి శంఖాన్ని విష్ణువు పాదాలచెంత పెట్టి పూజించడం వల్ల సకల సంపదలు కలుగుతాయని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

put shankhuvu in home in this direction

మరొక శంఖాన్ని పూజ తరువాత శంఖారావం చేయడం కోసం వినియోగించాలని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా రెండు శంఖాలను పూజ గదిలో వేర్వేరు స్థానాలలో ఉంచి పూజలు చేయాలి. అంతేకానీ శంఖాన్ని మన ఇంట్లో ఒక అలంకరణ వస్తువుగా ఉపయోగించకూడదని పండితులు తెలియజేస్తున్నారు.

Admin

Recent Posts