vastu

Lucky Cats : ఈ ల‌క్కీ క్యాట్స్‌ను ఇంట్లో పెట్టుకుంటే.. ధ‌న ప్ర‌వాహ‌మే..!

Lucky Cats : నల్ల పిల్లి ఎదురైతే, అపశకునం అని, ఏదో కీడు జరుగుతుందని, చాలామంది భావిస్తారు. ఎప్పుడూ కూడా నల్లపిల్లి ఎదురు వస్తే, వెళ్లకూడదని వెంటనే ఇంట్లోకి వెళ్లాలని చెప్తూ ఉంటారు. అయితే, కొందరు మాత్రం ఇంట్లో లక్కీ క్యాట్స్ ని పెట్టుకుంటారు. లక్కీ క్యాట్స్ ఇంట్లో ఉంటే, చాలా మంచిది అని భావిస్తారు. ఇది వరకు చూసుకున్నట్లయితే, ఎలాంటి కీడు జరగకుండా బాధa నుండి నుండి బయట పడాలని, ఇళ్లల్లో లాఫింగ్ బుద్ధాలని పెట్టుకునేవారు.

అయితే, ఇప్పుడు చాలామంది లక్కీ క్యాట్స్ ని పెట్టుకుంటున్నారు. ఈ అదృష్ట పిల్లులతో ఇంటికి అదృష్టం వస్తుందని, ఇంట్లో ఆఫీసులో కూడా పెట్టుకుంటున్నారు. వ్యతిరేక శక్తులు తొలగిపోయి కష్టాలు ఏమీ లేకుండా హాయిగా ఉండొచ్చు అని నమ్ముతారు. లాఫింగ్ బుద్ధ బొమ్మల్ని పక్కన పెట్టేసి, చాలామంది లక్కీ క్యాట్స్ ని ఉపయోగిస్తున్నారు. నిజానికి మన దేశంలో పిల్లి ఎదురు వస్తే అపశకునంగా భావిస్తారు.

put this type of lucky cats in home for wealth

కానీ, జపాన్ లో చూసుకున్నట్లయితే పిల్లిని అదృష్ట దేవతగా భావిస్తారు. లక్కీ క్యాట్స్ ఇంట్లో ఉంటే, ఎలాంటి కష్టాలు ఉండవట. విపరీతంగా లక్కీ క్యాట్స్ ని అక్కడ అమ్ముతున్నారు. లాఫింగ్ బుద్ధాలని పక్కన పెట్టేసి మరీ లక్కీ క్యాట్స్ ని ఉపయోగిస్తున్నారు. ఎక్కువగా ఇక్కడ లక్కీ క్యాట్ బొమ్మలు సేల్ అవుతున్నాయి. ఇది వరకు రోజుల్లో చూసుకున్నట్లయితే, లాఫింగ్ బుద్ధాలని ఇంట్లో పెట్టుకునే వారు.

లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉంటే, సిరిసంపదలు కలుగుతాయ‌ని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వాళ్ళ ఇళ్లల్లో పెట్టుకునే వారు. కానీ ఇప్పుడు లక్కీ క్యాట్స్ ని ఇళ్లల్లో పెట్టుకుంటున్నారు. ఇలా లక్కీ క్యాట్స్ వలన ఎన్నో లాభాలు పొందవ‌చ్చని అక్కడ మొదలుపెట్టారు. పైగా లక్కీ క్యాట్స్ ఇంట్లో ఉంటే, సిరి సంపదలు కూడా కలుగుతాయట. అదృష్టం కలిసి వస్తుందట. అంతా మంచే జరుగుతుందట.

Admin