sports

వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఛేజింగ్ చేసిన టీం ఏది?

<p style&equals;"text-align&colon; justify&semi;">మార్చి 12&comma; 2006&period; 438 గేమ్&period; వేదిక &colon; న్యూ వాండర‌ర్స్ స్టేడియం&comma; జోహాన్నెస్ బర్గ్‌&comma; సౌతాఫ్రికా&period; క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ చూడని అద్భుతం ఆవిష్కారం అయింది&period; 90 à°µ దశకం నుండి నిన్న మొన్నటి వరకు ఆసీస్&comma; దక్షిణాఫ్రికా మధ్య పోరు అంటే నువ్వా నేనా అన్నట్టు కొనసాగేది&period; దక్షిణాఫ్రికా vs ఆస్ట్రేలియా మధ్య 2006 మొదట్లో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో నాలుగు వన్డేలు ముగిసేసరికి ఇరుజట్లు చెరి రెండు మ్యాచ్లు గెలిచి సీరీస్ 2–2 తో సమంగా నిలిచాయి&period; నిర్ణయాత్మక అయిదవ వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు సైమన్ కటిచ్&comma; ఆడమ్ గిల్ క్రిస్ట్ లు అర్థ శతకాలతో రాణించి మంచి ఆరంభ భాగస్వామ్యాన్ని అందించారు&period; దీన్ని రికీ పాంటింగ్ కొనసాగిస్తూ కెరీర్లోనే అత్యంత వేగవంతమైన శతకాన్ని పూర్తి చేసుకొని&comma; తన అత్యధిక వ్యక్తిగత స్కోరు అయిన 164 స్కోర్ సాధించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివర్లో మైక్ హస్సీ&comma; సైమండ్స్&comma; బ్రెట్లీ మెరుపులతో అప్పటికి వన్డేలలో అత్యధిక ఇన్నింగ్స్ స్కోర్ అయిన 434 పరుగులు సాధించారు&period; రికీ పాంటింగ్ దీనికి ముందు వన్డేలలో మొదటి ఇన్నింగ్స్లో లో అధిక స్కోరు 398 పరుగులు శ్రీలంక పేరు మీద ఉంది&period; ఈ భారీ లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే హంసపాదు లాగా మూడు పరుగుల వద్ద డిపానర్ కేవలం ఒక్క పరుగు చేసి వెనుదిరిగాడు&period; అసలే కొండంత లక్ష్యం&comma; కానీ దక్షిణాఫ్రికా ఏమాత్రం వెనుకంజ వేయలేదు&period; గిబ్స్&comma; స్మిత్ దూకుడుగా ఆడి లక్ష్యాన్ని కొద్దికొద్దిగా కరిగిస్తూ వచ్చారు&period; మధ్యలో గిబ్స్&comma; స్మిత్ వెనుదిరిగిన&comma; వాళ్ళ స్థానంలో వచ్చిన వండర్ వాత్&comma; మార్క్ బౌచర్ అద్భుతంగా రాణించి జట్టుని లక్ష్యం వైపు గా తీసుకువెళ్లారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-82430 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;south-africa&period;jpg" alt&equals;"what is the best team in chasing highest total in odi cricket " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చివరి ఓవర్లో ఆరు బంతుల్లో 7 పరుగులు అవసరమయ్యాయి &period; స్ట్రైక్ లో ఉన్న బౌచర్ సింగిల్ తీసి నాన్ స్ట్రైక్ లో ఉన్న ఆండ్రూ హాల్ కి బ్యాటింగ్ ఇచ్చాడు&period; హాల్ బౌండరీ బాది నాలుగు పరుగులు సాధించాడు&period; కానీ తర్వాత బంతికి అలాంటి షాట్ ఆడాలని చూసి అవుటయ్యాడు&period; దీంతో దక్షిణ ఆఫ్రికా తొమ్మిదో వికెట్ ని నష్టపోయింది&comma; క్రీజులోకి మఖై నతిని వచ్చాడు&period; సింగిల్ తీసి స్ట్రైక్ ని బౌచర్‌కి ఇచ్చాడు&period; అందరిలోనూ నరాలు తెగే ఉత్కంఠ&comma; బంతిని తీసుకుని బ్రెట్లీ వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు&comma; బౌచర్ బంతిని లాంగ్ ఆన్ మీదుగా బౌండరీకి తరలించాడు&period; అంతే అద్భుతం ఆవిష్కృతమైంది&comma; డగౌట్ లో ఉన్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ప్రహరీగోడ దూకి మైదానం లోనికి పరిగెత్తి బౌచర్ ని అభినందించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పట్లో ఒక జట్టు నాలుగు వందల పరుగులు సాధించడమే అద్భుతం&comma; కానీ మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత జాక్ కలిస్ తన జట్టు సభ్యులతో ఇలా అన్నాడు&period; ఇది 450 పరుగులు చేయగలిగిన పిచ్&period; మన ప్రత్యర్థి జట్టు 15 పరుగులు తక్కువ చేసింది&comma; కాబట్టి మనం దీన్ని అవలీలగా చేదించవచ్చు అన్నాడు&period; ఈ వ్యాఖ్యలు దక్షిణాఫ్రికా జట్టు సభ్యుల‌ని బాగా ప్రభావితం చేసినట్లు ఉన్నాయి&period; మామూలుగా మొదటి ఇన్నింగ్స్‌లో భారీ పరుగులు చేసిన తర్వాత ప్రత్యర్థి జట్టు ఆత్మస్థైర్యం దెబ్బతిని రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలుతాయి&period; కానీ&comma; జాక్ కలిస్ ఈ మాట అన్నాడు అంటే తన జట్టుపై తనకున్న‌ నమ్మకాన్ని&comma; ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి&period; మరొక విశేషం ఏమిటంటే మ్యాచ్ ముందు రోజు రాత్రి హర్షల్ గిబ్స్ పీకలదాకా మద్యం సేవించాడు&comma; ఈ మ్యాచ్ ని హ్యాంగోవర్ లో ఆడి తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శనని నమోదు చేశాడు&period; ఇంకా ఈ మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts