vastu

Vastu Tips : పేదరికం పోయి.. ఐశ్వర్యం కలగాలంటే.. వెంటనే వీటిని ఇంట్లో నుండి తొలగించండి..!

Vastu Tips : చాలామంది, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఎక్కువమంది, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి సతమతమవుతుంటారు. పేదరికం పోయి, ఐశ్వర్యం కలగాలంటే కచ్చితంగా ఇలా చేయండి. మీ ఇంట్లో నుండి, వీటిని కనుక తొలగించారంటే, పేదరికం పోతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. పేదరికం ని తొలగించుకోవాలి అంటే, ఇలా చేయడం మంచిది. ఇంట్లో పావురం గూడు ఉంటే, దరిద్రం పట్టుకుంటుంది. కాబట్టి, ఇంట్లో డబ్బులు పోతాయి. పావురం గూడు ఉంటే తీసేయడం మంచిది. అలానే, అప్పుడప్పుడు మన ఇంట్లో తేనె పట్టు కూడా ఉంటుంది.

తేనె పట్టు కూడా ఉండకూడదు. తేనెటీగ చాలా ప్రమాదకరం. పైగా, ఇది ఉండడం వలన అదృష్టం తొలగిపోతుంది. దురదృష్టం కలుగుతుంది. పైగా ఇది ప్రమాదం కూడా. ఇది కూడా ఉంటే, వెంటనే ఇంట్లో నుండి తొలగించడం మంచిది. సాలెగూడు కూడా ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో సాలె పురుగు గూడు, జీవితంలో దురదృష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి, తీసేయండి. ఇంట్లో పగిలిపోయిన అద్దాలు ఉండకూడదు. చిన్నదే పగిలిపోయింది కదా అని చాలామంది వాడుతూ ఉంటారు. అలాంటి తప్పులు చేయకండి.

remove these from home immediately if you want wealth

పగిలిపోయిన అద్దం ఉంటే, వెంటనే తొలగించడం మంచిది. ఇంట్లో గబ్బిలాలు కూడా తిరుగుతూ ఉండకూడదు. ఇవి మీ జయాన్ని ఆపేస్తూ ఉంటాయి. మీకు ఇబ్బందుల్ని తీసుకువస్తాయి. ఆర్థిక సమస్యలను కలిగిస్తాయి. దానితోపాటుగా ఇంట్లో గోడలకి పగుళ్లు లేకుండా చూసుకోవాలి. ఇంట్లో గోడలకి పగుళ్లు ఉంటే, సంపదకి ఆటంకం కలుగుతుంది. ప్రతికూల శక్తి అక్కడ ఉంటుంది. కాబట్టి, ఈ పొరపాటు కూడా జరగకుండా చూసుకోండి.

ఇంటి కుళాయి ఎప్పుడు కూడా పని చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా పాడైపోయిన కుళాయి ఉంటే అది ఇంటికి అశుభాన్ని తీసుకువస్తుంది. ఇబ్బందుల్ని కలిగిస్తుంది. చాలామంది, మేడ మీద పనికిరాని వస్తువుల్ని పెడుతుంటారు. అది కూడా తప్పు. అటువంటివి చేయకండి. ఎండిపోయిన పువ్వులు, ఎండిపోయిన ఆకులు కూడా ఇంట్లో ఉండకూడదు. వీటిని వెంటనే తొలగించాలి. ఇలా, మీరు కనుక ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, కచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా సంతోషంగా ఉండొచ్చు.

Admin

Recent Posts