vastu

ధన – సంపదలు పెరగాలంటే ఏం చేయాలి?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరూ జీవితంలో సంపద&comma; శ్రేయస్సు కావాలని కోరుకోవడం సహజమే&period; అయితే చాలా సార్లు తెలిసి తెలియక చేసిన పొరపాట్లు వల్ల జీవితంలో సుఖ&comma; సంతోషాలు దూరమై ఆర్థిక సమస్యలకు కారణమవుతాయి&period; ఫలితంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది&period; వీటిని అధిగమించేందుకు ఏం చేయాలో వాస్తు శాస్త్రంలో సవివరంగా పొందుపరిచారు&period; ఈ విషయాలను జాగ్రత్తగా పట్టించుకుంటే ఆర్థిక ఇబ్బందులు అస్సుల తలెత్తువు&period; అంతేకాకుండా జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు&period; ఈ నేపథ్యంలో జీవితంలో ధన సంబంధిత విషయాల్లో ఇబ్బందులెదురవకుండా ఉండాలంటే వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి&period; లోపాలు ఎక్కడ ఉన్నాయో మీరు గుర్తిస్తే ఆ తప్పులు మళ్లీ చేయరు&period; మరి అవేంటో ఇప్పుడు చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తుశాస్త్రం ప్రకారం పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరముంది&period; ఏ ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కలకాలం ఉంటుందని విశ్వసిస్తారు&period; అది ఇల్లు&comma; బట్టలు మాత్రమే కాదు&period;&period; ఇంటి ఫ్లోరింగ్&comma; పాదాలు కూడా శుభ్రంగా ఉండాలి&period; అలా ఉంటే అదృష్టం కలిసి వస్తుంది&period; కానీ చాలా మంది తమ ముఖాన్ని బాగుందా లేదా అని చూసుకుంటారు కానీ పాదాలపై దృష్టిపెట్టరు&period; వాస్తుశాస్త్రం ప్రకారం ఏ వ్యక్తి పాదాలైన మురికిగా ఉన్నట్లయితే వారి గౌరవం తగ్గుతుందని గుర్తుంచుకోవాలి&period; అంతేకాకుండా సమస్యలు కూడా ఎక్కువయ్యే అవకాశముంటుంది&period; వాస్తుశాస్త్రం ప్రకారం ఎప్పుడూ నీటికి సంబంధించిన ఫొటోలను షో-పీస్ కోసం వంట గదిలో ఉంచకూడదు&period; వంట గదిలో నీరు లేదా నీటికి సంబంధించిన వస్తువులు వంట గదిలో ఉంచడం శుభం కాదని నమ్ముతారు&period; షో-పీస్ లేదా నీటి చిత్రాన్ని వంటగదిలో ఉంచితే అశుభంగా భావిస్తారు&period; ఎందుకంటే ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వెంటాడటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-81140 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;money-3&period;jpg" alt&equals;"vastu tips to follow to increase wealth " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కున ఉన్న గోడ అల్మారాలో డబ్బులు ఎప్పుడూ దాచకూడదు&period; ఎందుకంటే ఆ అల్మారా దక్షిణానికి అభిముఖంగా ఉండటం వల్ల ఆర్థిక నష్టాన్ని కలగజేస్తుంది&period; కాబట్టి ఉత్తరదిక్కులో ఉన్న అల్మారాలో డబ్బును మర్చిపోయి కూడా దాచకూడదు&period; ఒకవేళ దాచుకోవాలంటే పడమటి దిక్కులో గోడకు ఉన్న అల్మారాలో ఉంచితే మంచి జరుగుతుంది&period; ఎందుకంటే ఈ అల్మారా తూర్పుకు అభిముఖంగా ఉంటుంది&period; ఫలితంగా వ్యక్తి జీవితంలో లక్ష్మీ కటాక్షం తాండవిస్తుంది&period; వాస్తుశాస్త్రం అనుసారం గణేశుడి విగ్రహం ఇంట్లో ఉంచితే ఆ వ్యక్తి ఎప్పుడూ డబ్బును కోల్పోడు&period; కాని కొంత మంది దీన్ని వేరే ఇతర దిక్కులో ఉంచుతారు&period; ఫలితంగా వాస్తుదోషం పెరగడమే కాకుండా ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి&period; పలితంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది&period; అంతేకాకుండా సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు&period; కాబట్టి మీరు గణేశుడి విగ్రహాన్ని ఇల్లు లేదా కార్యాలయంలో అభిముఖంగా ఉంచితే మంచి జరుగుతుంది&period; ఫలితంగా సంపద కూడా పెరుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీ జీవితంలో సంపదను కోల్పోతే ఇంట్లో నీటి కుండ ఏ స్థితిలో ఉందో పరిశీలించండి&period; వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో నీటి పాత్రను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి&period; ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యుల దురదృష్టం దూరమవుతుంది&period; ఇదే సమయంలో సంపద కూడా పెరుగుతుంది&period; అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలుగుతాయి&period; ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది&period; మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts