viral news

ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్న న‌ది.. భ‌యంతో బ్రిడ్జిపై ప‌రుగులు పెట్టిన ప్ర‌జ‌లు..

నేపాల్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా బీహార్‌లోని పలు జిల్లాలు నీట మునిగాయి. సరిహద్దు జిల్లాల్లో చాలా చోట్ల నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. 1968 నుంచి ఇప్పటి వరకూ నేపాల్‌లో ఇంత భారీ వర్షాలు ప‌డిన దాఖ‌లాలు లేవు. ఈ ఏడాది సెప్టెంబర్ 27 నుంచి నేపాల్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోసి బ్యారేజీ వీర్‌పూర్ నుంచి ఆదివారం రికార్డు స్థాయిలో 6,61,295 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గండక్ బ్యారేజీలో దాదాపు అంతే మొత్తంలో నీటిని విడుదల చేశారు.

ఈ క్ర‌మంలో బీహార్‌లో కోసి, గండక్ బాగ్మతి, బుద్ధి గండక్, కమల బాలన్, మహానంద, గంగా వంటి నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ నదుల నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ఈ నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. కోసి బ్యారేజీ వీర్‌పూర్ నుంచి రికార్డు స్థాయిలో నీటి విడుదలతో 13 జిల్లాల్లో 16.28 లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే భారీ వర్షాల కారణంగా బీహార్ ప్రజలు వరదలతో పోరాడుతున్నారు. తాజాగా కోసి నది పరవళ్లు తొక్కుతూ ప్ర‌వ‌హిస్తుండ‌డంతో నీటి ప్రవాహం వంతెనను తాకింది. ఆ బ్రిడ్జిపై ఉన్న జనం ఇది చూసి భయాందోళన చెందారు. కేకలు, అరుపులతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

kosi river over flow peope panic and ran on bridge

కోసి డ్యామ్ నీటిమట్టం ఒక్క‌సారిగా పెర‌గ‌డంతో అక్కడున్న వంతెనను నీటి ప్రవాహం తాకుతున్నది. ఇది చూసి ఆ బ్రిడ్జిపై ఉన్న జనం భయాందోళన చెందారు. అరుస్తూ వంతెన పైనుంచి పరుగెత్తారు. దీంతో పోలీసులు స్పందించారు. మహిళలు, పిల్లలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. కొందరు వ్యక్తులు ఫొటోలు తీయడంలో బిజీ అయ్యారు.మరోవైపు రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రంజీత్ రంజన్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. కోసి డ్యామ్ నీటిమట్టం పెరుగడం వల్ల నది ఉప్పొంగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో నదుల చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లవద్దన్న ప్రభుత్వం హెచ్చరికలను ప్రజలు పాటించాలని కోరారు. ప్ర‌స్తుతం ఈ వీడియో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది.

Sam

Recent Posts