ప్రతీ నెలా ఒకటవ తేదీన కొన్ని రూల్స్ మారుతూ ఉంటాయి. అక్టోబర్ 1 నుంచి కూడా కొన్ని రూల్స్ మారబోతున్నాయి. మరి ఈరోజు నుంచి ఎలాంటి రోజు అమల్లోకి వస్తున్నాయి..? వాటి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆధార్ కార్డు మొదలు సుకన్య సమృద్ధి యోజన వరకు ఇలా కొన్ని రూల్స్ లో మార్పులు వచ్చాయి. వాటి కోసం ఇప్పుడే తెలుసుకుందాం.. పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయడానికి లేదా ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి ఇకపై ఉపయోగించడానికి అవ్వదు. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తోంది. అలాగే, ఈరోజు నుంచి ప్రధానమంత్రి ఈ డ్రైవ్ యోజన స్కీమ్ అమల్లోకి రాబోతోంది. ఈ క్రమంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళకి రూ. 50,000 వరకు సబ్సిడీ అందించబోతున్నారు.
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్లో ముఖ్యమైన మార్పు జరుగుతుంది. ఈరోజు నుంచి కుమార్తెల చట్టపరమైన సంరక్షకులు మాత్రమే ఖాతాలను నిర్వహించగలరు. కొత్త రూల్ ప్రకారం, కూతురికి చట్టపరమైన సంరక్షకుడు కానీ వ్యక్తి కానీ తెరిచి ఉంటే ఆ ఖాతాను బయోలాజికల్ పేరెంట్ లేదా లీగల్ గార్డియన్ కి బదిలీ చేయాలి. స్టాక్ మార్కెట్లలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే ట్రాన్సాక్షన్స్ పై పన్ను పెరుగుతుంది.
అలాగే ఈరోజు నుంచి ఎవరైనా 50 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని అమ్మితే దానిపై ఒక శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. మైనర్ ఎకౌంట్లో వడ్డీ రేట్లు పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ రేట్లకు అనుగుణంగా ఉంటాయి. PPF ఖాతాల్లో కూడా ఈ మార్పులు ఈరోజు నుంచి రాబోతున్నాయి. ఈరోజు నుంచి ఈ కార్మికులకు పెరిగిన వేతనాలు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాన్ని రోజుకు రూ.1035 కు పెంచింది. దీపావళి రాబోతున్న నేపథ్యంలో 14 కిలోల డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధరలు తగ్గే అవకాశం ఉంది.