viral news

Optical illusion: ఈ ఫోటోలో ఉన్న ఏనుగు మీరు కనిపెట్టగలరా.. సాధ్యమవుతుందా..?

ఆప్టికల్ ఇల్యూజన్ అనేది మన కంటికి మరియు మెదడుకు మేత లాంటిది. కొన్ని రకాల ఆప్టికల్స్ ఇల్యూజన్స్ మెదడును పరీక్షించడంలో ఎంతో ఉపయోగపడతాయి. దీని ద్వారా మీ స్వభావం, లక్షణాలు ఎలాంటివో కూడా తెలుసుకోవచ్చు. ఇది గత దశాబ్ద కాలం నుంచి ప్రాచుర్యం పొందాయి. నేటికి కూడా ప్రాచుర్యం లోనే ఉన్నాయి. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఎలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోస్ కనబడిన వెంటనే షేర్ చేస్తున్నారు. ఇందులో ఉన్నది మీరు కనిపెట్టగలరా అని క్వశ్చన్ కూడా వేస్తూ సవాల్ విసురుతున్నారు. అందులో ఉన్నది ఏంటో మనం చెప్పడానికి అనేక ఇబ్బందులు పడతాం.

కొంతమంది మాత్రం చాలా తొందరగా అందులో ఉన్నది ఏంటో కనిపెడతారు. కానీ కొంతమందికి అది ఏంటో తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. మనం ప్రస్తుతం చూడబోయే ఆప్టికల్ ఏమిటంటే ఈ ఫోటో లో దాగి ఉన్నటువంటి ఏనుగును కనిపెట్టడం. దాన్ని కనిపెట్టడం అంత సులువైన పని అయితే కాదు. ఇప్పటి వరకు దాన్ని కేవలం ఒక్క శాతం మంది మాత్రమే కనుక్కున్నారు. మరి మీరు కూడా ఒక సారి ట్రై చేయండి.. కనిపెట్ట లేక పోతున్నారా.. అయితే ఓసారి ఇది చూడండి..

Optical illusion have you found elephant in this photo

ఈ ఫోటోను బాగా పరిశీలించి చూస్తే.. చుట్టూ దట్టమైన చెట్లు మధ్యలో ఒక వేటగాడు వేటాడడం కోసం ఎదురు చూస్తున్నాడు. అది కూడా మనం వెతుకుతున్న ఏనుగు కోసమే కావచ్చు.. మీరు ఏనుగు పెద్దగానే ఉంటుంది సులభంగా కనిపెట్టవచ్చు అని అనుకున్నప్పటికీ.. ఈ పజిల్ అంత సులభమైనది కాదు.. దీని కనిపెట్టాలంటే మీ ఫోను తలకిందులుగా చేసి పెట్టుకోండి. చేతిలో తుపాకి పట్టుకొని ఉన్నటువంటి వేటగాడి కాళ్ల దగ్గర రెండు ఏనుగు కాళ్లు, మరో రెండు పెద్ద చెట్లు, అలాగే ఏనుగు తొండం దాని పక్కనే ఉన్న చిన్న చెట్టు.. మీరు ఇప్పుడైనా ఎలుగును చూడగలరా.. ఇలాంటి ట్విస్ట్ ఉన్నందున ఏనుగు ఎవరు కనిపెట్టలేక పోయారు.

Admin

Recent Posts