సోషల్ మీడియాలో మనకి ఎన్నో వింతలు, విచిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. నెట్టింట వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. సౌత్ ఆఫ్రికాలో ఇది చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సౌత్ ఆఫ్రికా కి చెందిన ఓ వ్యక్తి ఈ వీడియోని షేర్ చేశారు. ఒక ఉడుత చిరుత పులిని చూసి భయపడకుండా దాని ఎదుటకు వెళ్ళింది. ఆ పులి కంటే వంద రెట్లు చిన్నదైనా ఉడత దాని ఎదుటకు వెళ్ళింది,
అసలు పారిపోలేదు. చిరుత పులి వచ్చే వరకు ధైర్యంగా చెట్టు పైనే ఉడత కనపడేటట్టు నిలబడి ఉంది. అసలు భయపడకుండా ఉంది. ఆ తర్వాత చిరుత పులి వచ్చాక నెమ్మదిగా పక్కకు జరిగింది. అలా అని పారిపోలేదు. మళ్లీ చెట్టుపై మరో చోట నిలబడింది. పులి దాని వెంట వెళ్లడానికి చూసింది.
ఉడుత ఏమాత్రం భయపడకుండా ఆ చెట్టు పైకి కిందకి పులిని పరిగెత్తిస్తోంది, ఉడుత అంత పెద్ద పులిని చూసి భయపడకుండా ఏదో ఆడుకుంటున్నట్లు వ్యవహరించింది. ఈ వీడియోను చూసిన వాళ్ళందరూ కూడా ఉడుత ధైర్యాన్ని ప్రదర్శించాలని అనుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో పై మరి మీరు కూడా ఒక లుక్ వేసేయండి.