మానసిక ప్రవర్తన సరిగ్గా లేని వారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంటారు. ఆ మహిళ కూడా సరిగ్గా అలా చేసింది. అయితే ఆమె అలా ఎందుకు చేసింది అన్న విషయాన్ని పక్కన పెడితే అలాంటి మహిళను అసలు విమానం ఎలా ఎక్కనిచ్చారు.. అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వారు బయటకు వస్తే తోటి మనుషులకు కూడా ఇబ్బందే కలుగుతుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
అమెరికాలోని హూస్టన్‌లో ఉన్న విలియం పి.హాబీ ఎయిర్ పోర్టు నుంచి ఫీనిక్స్‌కు వెళ్తున్న ఓ విమానం టేకాఫ్ అవుతుండగా.. ఉన్నట్లుండి ఓ మహిళా ప్రయాణికురాలు సడెన్‌గా దుస్తులను విప్పి పైలట్లు ఉండే కాక్‌పిట్ ఏరియా వైపు వెయిట్ అంటూ పరుగులు పెట్టింది. తరువాత కాక్ పిట్ డోర్ తెరవాలని తన తలతో డోర్‌ను కొడుతూ బిగ్గరగా కేకలు వేసింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో కాసేపు వారికి అర్థం కాలేదు.
అలా ఆ మహిళ సుమారుగా 30 నిమిషాల పాటు నానా భీభత్సం సృష్టించింది. దీంతో ప్రయాణికులందరూ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం తెలియడంతో వారు ఫ్లైట్‌ను కాసేపు ఆపి ఆ మహిళను దింపేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా ఆమెకు మతి స్థిమితం సరిగ్గా లేనట్లు వెల్లడైంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ అసౌకర్యానికి గాను సదరు విమానయాన సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ఇక ఆ మహిళ అలా ఫ్లైట్‌లో నగ్నంగా తిరుగుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.