information

దుబాయ్‌లో బంగారం రేటు ఎంతో తెలుసా..? ఒక్క వ్య‌క్తి ఇండియాకు ఎంత బంగారం తేవ‌చ్చు..?

క‌న్న‌డ న‌టి రన్యారావు బంగారం అక్ర‌మ ర‌వాణా కేసులో అరెస్టు అయిన విష‌యం తెలిసిందే. దీంతో దుబాయ్‌లో అస‌లు బంగారం రేటు ఎంత ఉంటుంది..? అని చాలా మంది తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దుబాయ్‌లో 10 గ్రాముల బంగారం ధ‌ర ప్ర‌స్తుతం 887 డాల‌ర్లుగా ఉంది. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ.77వేలు అన్న‌మాట‌. ప్ర‌స్తుతం బంగారం ధ‌ర మ‌న దేశంలో 10 గ్రాముల‌కు రూ.87వేలుగా ఉంది. అంటే మన దేశంలో క‌న్నా దుబాయ్‌లో బంగారం ధ‌ర 11.58 శాతం త‌క్కువ‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

ఇక దుబాయ్‌లో ఒక వ్య‌క్తి బంగారం కొంటే స్త్రీలు అయితే 20 గ్రాములు, పురుషులు అయితే 40 గ్రాములు, పిల్ల‌ల‌కు అయితే రూ.1 ల‌క్ష వ‌ర‌కు విలువైన బంగారాన్ని ఉచితంగా తెచ్చుకునేందుకు అన‌మ‌తులు ఇస్తారు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన ప‌నిలేదు. కానీ ఆ ప‌రిమితి మించితే 6 శాతం క‌స్ట‌మ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.82వేలు అవుతుంది. అయితే దుబాయ్ నుంచి బంగారం తెస్తే సుంకం చెల్లించినా కూడా ఇక్క‌డి క‌న్నా అక్క‌డే మ‌న‌కు త‌క్కువ ధ‌ర‌కు బంగారం వ‌స్తుంది. క‌నుక‌నే చాలా మంది దుబాయ్ నుంచి బంగారం తెస్తుంటారు.

how much gold indians can bring from dubai

కానీ న‌టి ర‌న్యారావు ఈ ప‌రిమితికి మించి అక్ర‌మంగా బంగారాన్ని తేవ‌డంతో అరెస్టు అయింది. దుబాయ్‌లో బంగారం ధ‌ర చాలా త‌క్కువ‌గా ఉంటుంది. క‌నుకనే అక్క‌డి నుంచి చాలా మంది బంగారం తెస్తుంటారు. అక్క‌డ ఎయిర్ పోర్టుల్లోనూ బంగారు దుకాణాలు ఉంటాయ‌ట‌. ప్ర‌యాణికులు వెళ్తూ వెళ్తూ కూడా షాపింగ్ చేస్తార‌ట‌. క‌నుక‌నే అక్క‌డ ఎయిర్‌పోర్టుల్లోనూ బంగారం షాపులు ఉంటాయి. చాలా మంది దుబాయ్ నుంచి బంగారాన్ని అందుక‌నే తెస్తుంటారు.

Admin

Recent Posts