Categories: యోగా

పొట్ట దగ్గరి కొవ్వును కరిగించే ఆసనం.. వేయడం సులభమే..!

యోగాలో అనేక రకాల ఆసనాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఆసనం భిన్న రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ క్రమంలోనే అత్యంత సులభంగా వేయదగిన ఆసనాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిల్లో మండూకాసనం కూడా ఒకటి. దీన్నే్ ఫ్రాగ్‌ పోజ్‌ అంటారు. అంటే కప్పలా ఆసనం వేయడం అన్నమాట. ఈ ఆసనాన్ని ఎలా వేయాలి ? దీంతో ఏమేం లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

how to do mandukasanam and its benefits

మండూకాసనం వేసే విధానం

వెన్నును నిటారుగా వజ్రాసన స్థితిలో కూర్చుని, అరచేతులను తొడలపై ఉంచాలి. రెండు పిడికిళ్లను బిగించి కింది పొట్టకు ఆనించాలి. మోకాళ్లను కొంచెం దూరం జరిపి నడుమును వంచి నుదురును నేలకు ఆనించాలి. ఆ స్థితిలో పది సార్లు్ శ్వాస తీసుకుని వదిలిన తరువాత నెమ్మదిగా యథాస్థితికి రావాలి. మొదటి ప్రయత్నంలో నుదుటిని నేలకు ఆనించడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు బలవంతంగా ఆనించే ప్రయత్నం చేయరాదు. సాధనతో సాధ్యం చేసుకోవాలి.

మండూకాసనం వేయడం వల్ల కలిగే ఉపయోగాలు

1. మండూకాసనం వేయడం వల్ల పొట్ట, నడుము, తొడలు, పిరుదుల భాగాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది.

2. ఈ ఆసనం వేయడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరగడంతోపాటు అధిక బరువు తగ్గుతారు.

3. గర్భకోశ వ్యాధులు, రుతు సంబంధ సమస్యలు పోతాయి.

4. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ ఆసనం వేస్తే ఉపశమనం లభిస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts