Bigg Boss OTT Telugu : బుల్లితెర ప్రేక్షకులకు వినోదం అందించేందుకు మరోమారు బిగ్ బాస్ షో రెడీ అయింది. శనివారం నుంచి బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు షో ప్రారంభం కానుంది. దీనికి ఇప్పటికే బిగ్ బాస్ నాన్‌స్టాప్‌గా నామకరణం చేశారు. ఈ క్రమంలోనే ఈ షో రోజుకు 24 గంటలూ లైవ్ స్ట్రీమ్ కానుంది. ఇక 24 గంటల పాటు నాన్‌స్టాప్‌గా బిగ్ బాస్ షోను చూసి ఎంజాయ్ చేయవచ్చు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో ఈ షో ప్రసారం కానుంది. ఈ క్రమంలోనే నిర్వాహకులు తాజాగా ఓ ప్రోమోను కూడా విడుదల చేశారు.
బిగ్ బాస్ 5వ సీజన్ ఇటీవలే ముగియగా.. అందులో కంటెస్టెంట్లు చివర్లో ఎంతగానో అలరించారు. అయితే శనివారం నుంచి ప్రారంభం అవుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మరింత వినోదాన్ని అందిస్తుందని తెలుస్తోంది. ఎందుకంటే గత సీజన్లలో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్లను కూడా ఈ షోలోకి తీసుకున్నారు. దీంతో షో అంతా రచ్చ రచ్చ ఉంటుందని తెలుస్తోంది.
ఇక శనివారం సాయంత్రం 6 గంటలకు ఈ షో లాంచ్ కానుంది. ఈ క్రమంలోనే నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ షోలో పాల్గొననున్న కంటెస్టెంట్ల వివరాలను ప్రకటించలేదు. కానీ ఓ లిస్ట్ అయితే ప్రచారంలో ఉంది. ఇక మరికొద్ది గంటల్లో దానికి కూడా తెర పడనుంది. షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరో తేలనుంది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో ముమైత్ ఖాన్, తనీష్, అషు రెడ్డి, అరియానా, అఖిల్ సార్థక్, మహేష్ విట్టా, సరయూ, హమీదా, నటరాజ్ మాస్టర్, రోహిణి, రోల్ రైడా.. ఇలా కొందరు పాత కంటెస్టెంట్లు పాల్గొంటారని సమాచారం. అలాగే యూట్యూబర్ యాంకర్ నిఖిల్, యాంకర్ స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, బిందు మాధవి, యాంకర్ శివ, బమ్ చిక్ బబ్లూ, కప్పు ముఖ్యం బిగులూ వెంకట్, మిత్రా శర్మ, శ్రీరాపాక వంటి కొత్త కంటెస్టెంట్లు కూడా ఇందులో పాల్గొనబోతున్నారని.. మొత్తం 18 మంది పాల్గొంటారని సమాచారం. ఈ షో 84 రోజుల పాటు జరుగుతుందని తెలుస్తోంది. అయితే ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనను బట్టి రోజుల సంఖ్యను మరింతగా పెంచే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది.