సాధారణంగా ఒక సినిమా వస్తుంది అంటే అందులో హీరో, హీరోయిన్, విలన్ ల పాత్రలు బాగుంటే ఆ మూవీ హిట్ అవుతుంది. సాధారణంగా హీరోయిజం బాగా ఉండాలి అంటే అందులో విలన్ పాత్ర కూడా అలాగే ఉండాలి. కానీ చివరికి హీరో విలన్ ని ఓడిస్తాడు అనే సినిమా కథలు మనకు ఎక్కువగా తెలుసు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. సినిమాల్లో ఒక్కోసారి హీరోల కంటే విలన్ల పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. హీరోతో సమానంగా విలన్ క్యారెక్టర్ ను ప్రెజెంట్ చేస్తున్నారు. కొన్ని సినిమా ల్లో హీరో విలన్ ని కండబలంతో కాకుండా తన తెలివితో అంతం చేస్తాడు. ప్రస్తుతం ఆడియన్స్ కి ఇదే కావాలి. ప్రస్తుతం ఇలాంటి సినిమాలు వస్తుంటే, దర్శక నిర్మాతలకు నిర్మాతలకు విలన్స్ ను సెట్ చేయడం పెద్ద కష్టం గా మారిపోతుంది. అయితే ఈ విషయాలను పక్కన పెడితే సినిమాల్లో విలన్ డామినేషన్ ఎక్కువైన మూవీస్ చూద్దాం..
మాస్టర్.. ఈ సినిమాలో హీరో విజయ్ కి దీటుగా విలన్ విజయ్ సేతుపతి క్యారెక్టర్ ఉంటుంది. ఇందులో హీరో పాత్ర కంటే విలన్ పాత్ర ఎక్కువగా క్రేజ్ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. స్పైడర్.. ఈ సినిమాలో మహేష్ బాబు కంటే విలన్ పాత్రలో చేసిన ఎస్.జె.సూర్య క్యారెక్టర్ హైలెట్ అయ్యింది. ఇందులో విలన్ గా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అభిమన్యుడు.. ఈ సినిమాలో విశాల్ హీరోగా నటిస్తే విలన్ పాత్రలో అర్జున్ చేశారు. కానీ అర్జున్ నటనే ఇందులో హైలైట్ గా నిలుస్తుంది.
నానిస్ గ్యాంగ్ లీడర్.. ఈ సినిమాలో కూడా అంతే. విలన్ పాత్ర హైలెట్ అవుతుంది, హీరోకి చెమటలు పట్టిస్తుంటాడు. బాహుబలి.. జక్కన్న దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీలో రాణా విలన్ గా నటించారు. ఇందులో రానా పాత్ర హైలెట్ గా నిలుస్తుంది. సెవెంత్ సెన్స్.. ఈ చిత్రంలో కూడా హీరో సూర్య పాత్ర కంటే విలన్ జానీ పాత్ర ఎక్కువగా ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. వర్షం.. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మూవీలో విలన్ పాత్రలో గోపీచంద్ అదరగొట్టేశారు. జులాయి.. ఈ సినిమాలో అల్లు అర్జున్ కంటే సోనూసూద్ పాత్ర హైలెట్ గా నిలుస్తుంది. ఇందులో సోనుసూద్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది.