Coconut Oil : కొబ్బరినూనెను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వంట ఇంటి సామగ్రిగా ఉపయోగిస్తున్నారు. కొబ్బరినూనెతో అనేక రకాల వంటలను తయారు చేస్తుంటారు. ముఖ్యంగా కేరళ వాసులు కొబ్బరినూనెను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే కొబ్బరినూనెతో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా చర్మ సౌందర్యం పెరుగుతుంది. ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి.
రాత్రి నిద్రకు ముందు కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని లైట్‌గా ముఖంపై అప్లై చేయాలి. జిడ్డు లేకుండా చూసుకుని కేవలం కొద్ది మొత్తంలో మాత్రమే కొబ్బరినూనెను తీసుకుని ముఖంపై రాయాలి. తరువాత నిద్రించాలి. మరుసటి రోజు ఉదయం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి.
మొటిమలు, తెల్లని, నల్లని మచ్చలు ఉన్నవారు ఇలా చేస్తే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే ముఖం కాంతివంతంగా మారుతుంది. మెరుస్తుంది. మృదువుగా, తేమగా ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది. అయితే జిడ్డు చర్మం ఉన్నవారు ఈ చిట్కాను పాటించరాదు.
కొబ్బరినూనెను ఇలా రాత్రి పూట ముఖానికి రాస్తే ముఖంపై ఉండే ముడతలు కూడా పోతాయి. ముఖం యవ్వనంగా కనిపిస్తుంది. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావు. ఇలా కొబ్బరినూనెతో సౌందర్య పరంగా కూడా ఎన్నో లాభాలు కలుగుతాయి.