Oats : రోజూ ఉదయం మనం తీసుకునే ఆహారం చాలా బలవర్ధకమైనది అయి ఉండాలి. అప్పుడే మన శరీరానికి ఒక రోజుకు కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉదయమే లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఉదయం తీసుకోవాల్సిన అత్యుత్తమమైన ఆహారాల్లో ఓట్స్ ఒకటి అని చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ మంచి ఆహారం అని చెప్పవచ్చు. వీటిల్లో ఉండే ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది. కనుక అధిక బరువు తగ్గాలనుకునేవారు రోజూ ఉదయాన్నే ఓట్స్‌ను తింటే ఎంతో మేలు జరుగుతుంది.
ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా మలబద్దకం నుంచి బయట పడవచ్చు. అలాగే చిన్నారులు, వృద్ధులకు ఇవి సులభంగా జీర్ణమవుతాయి కూడా. కనుక వారు కూడా రోజూ వీటిని తినవచ్చు.
ఓట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీని వల్ల హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఓట్స్‌లో ఐరన్, కాల్షియం, మెగ్నిషియం వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. నిద్రలేమి తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణాశయంలో ఉండే బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
ఓట్స్‌ను మరిగించిన వేడి పాలలో వేసి కొద్దిగా తేనె, పండ్ల ముక్కలు వేసి కలిపి తినవచ్చు. ఇలా తింటే కాస్త తియ్యగా అనిపిస్తుంది. కనుక ఓట్స్‌ను ఘాటుగా కోరుకునేవారు వాటితో ఉప్మా తయారు చేసుకుని తినవచ్చు. అందులో కాస్త మిరియాల పొడి చల్లితే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా ఓట్స్‌ను భిన్న రకాలుగా తీసుకోవచ్చు. కానీ ఉదయం వీటిని తీసుకుంటేనే అధికంగా ప్రయోజనాలు కలుగుతాయి.