Joint Pain : మనకు దోమల ద్వారా వచ్చే జ్వరాలల్లో చికెన్ గున్యా జ్వరం ఒకటి. ఈ జ్వరం వచ్చిన వారిలో కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. చేతి వేళ్ల దగ్గర నుండి కాళ్ల వరకు శరీరం అంతా నొప్పులుగానే ఉంటుంది. జ్వరం తగ్గినా ఈ కీళ్ల నొప్పులు మాత్రం చాలా రోజుల వరకు తగ్గవు. ఈ కీళ్ల నొప్పులతో సంవత్సరం పాటు బాధపడే వారు కూడా ఉంటారు. వీరు ప్రతి రోజూ నొప్పులను తగ్గించే రకరకాల మందులను వాడుతూ ఉంటారు. ఆయుర్వేదం ద్వారా ఈ నొప్పులను మూడు నుంచి వారం రోజులల్లో తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే ఉండి ఈ నొప్పులను తగ్గించుకోవడానికి ఉపవాసమే మంచి మార్గమని వారు చెబుతున్నారు. దీని కోసం మనం నీటితో చేసే ఎనీమా డబ్బాను తీసుకుని ప్రతి రోజూ కచ్చితంగా ఒకసారి ఎనీమా చేసుకోవాలి.
ప్రేగుల్లో ఉండే వ్యర్థాలను బయటకు పంపించడానికి ఎనీమా ఉపయోగపడుతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు నీరు, తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తాగాలి. ఒక రోజులో పావు కిలో తేనెను నిమ్మరసం, నీటితో కలిపి తీసుకోవాలి. దీనితోపాటు రోజుకి రెండు పూటలా వేడి నీళ్ల స్నానం చేయాలి. ఇలా ఉపవాసాన్ని పూర్తిగా నొప్పులు తగ్గే వరకు చేయాలని వైద్యులు చెబుతున్నారు. ఈ నొప్పులు పూర్తిగా తగ్గడానికి మూడు రోజుల నుండి వారం రోజులు సమయం పడుతుంది. కనుక నొప్పులు పూర్తిగా తగ్గే వరకు నీరు, తేనె నిమ్మరసం కలిపిన నీళ్లు, అప్పుడప్పుడూ కొబ్బరి నీళ్లను మాత్రమే తాగుతూ ఉపవాసం చేయాలని, వారం రోజుల కంటే ఎక్కువగా ఈ ఉపవాసాన్ని చేయకూడదని వారు చెబుతున్నారు.
నొప్పులు తగ్గిన వారు మరుసటి రోజు పండ్లను, పండ్ల రసాలను తీసుకుని తరువాత నుండి భోజనం చేయవచ్చని, వారం రోజుల తరువాత కూడా నొప్పులు తగ్గని వారు నొప్పులు తగ్గే వరకు పండ్ల రసాలను తీసుకుంటూ ఉపవాసం చేయాలని వారు చెబుతున్నారు. ఇలా ఉపవాసం చేయడం వల్ల చికెన్ గున్యా జ్వరంతోపాటు ఎన్నో రోజుల నుండి వేధిస్తున్న కీళ్ల నొప్పులు కూడా తగ్గుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.