Puli Adugu Mokka : ప్రకృతిలో మన ఆరోగ్యానికి మేలు చేసే మొక్కలతోపాటు దుష్ట శక్తులను మన దరి చేరకుండా చేసే మొక్కలు కూడా ఉంటాయి. అలాంటి మొక్కల్లో పులి పంజా మొక్క కూడా ఒకటి. దీనిని పులి అడుగు మొక్క, పురుటి కాడ మొక్క, మెకము అడుగు మొక్క అని కూడా అంటారు. బీడు భూముల్లో, అటవీ ప్రాంతాలలో, బంజరు భూముల్లో, చేలల్లో ఈ మొక్క మనకు విరివిరిగా కనబడుతుంది. ఈ మొక్క తీగ జాతికి చెందినది. చెట్లకు అల్లుకుని ఈ పులి పంజా మొక్క ఎక్కువగా పెరుగుతుంది. ఈ తీగ మొక్కను చాలా మంది చూసే ఉంటారు. కానీ ఈ మొక్క వల్ల కలిగే ఉపయోగాల గురించి మనలో చాలా మందికి తెలియదు. ఈ మొక్క ఆకులు పులి అడుగులాగా ఉంటాయి. కనుక దీనిని పులి అడుగు, పులి పంజా మొక్క అని అంటారు.
దీనిని ఇంగ్లీష్ లో టైగర్ ఫుట్, టైగర్ పా అని పిలుస్తారు. ఈ తీగ మొక్కను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. కుక్క కాటుకు విరుగుడుగా ఈ మొక్కను పూర్వకాలంలో ఉపయోగించేవారు. కుక్క కరిచిన వెంటనే ఈ మొక్క ఆకులను, కాడలను, పువ్వులను దంచి రసాన్ని తీసి ఆ రసాన్ని కుక్క కరిచిన వ్యక్తికి తాగించేవారు. ఈ విధంగా చేయడం వల్ల కుక్క కాటు విషం హరించుకుపోతుంది. ముఖం పై వచ్చే మొటిమలను తగ్గించడంలో కూడా ఈ పులి పంజా మొక్క మనకు ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి మెత్తగా నూరి పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు ముఖానికి రాసి ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల రెండు రోజుల్లోనే ముఖంపై వచ్చిన మొటిమలు తగ్గిపోతాయి.
జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఈ మొక్క ఆకులను పేస్ట్ లా చేసి శరీరం మొత్తం రాయాలి. ఇలా రాసిన 15 నిమిషాల తరువాత వేడి నీటితో స్నానం చేయించాలి. ఇలా చేయడం వల్ల జ్వరం వెంటనే తగ్గుతుంది. తేలు కాటుకు, పాము కాటుకు గురయినప్పుడు ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని కాటుకు గురి అయిన ప్రదేశంలో ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేయడం వల్ల విషం హరించుకుపోతుంది. మొలలను తగ్గించడంలో కూడా ఈ మొక్క మనకు సహాయపడుతుంది. పులి పంజా మొక్క ఆకులను మెత్తని పేస్ట్ లా నూరాలి. ఈ పేస్ట్ ను మొలలపై రాయడం వల్ల మొలల సమస్య తగ్గుతుంది.
కీళ్ల నొప్పులతో, మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ తీగ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి దానిని నొప్పి ఉన్న భాగంలో ఉంచి కట్టుకట్టాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల నొప్పులు తగ్గుతాయి. గాయాలు, పుండ్ల వంటి వాటిపై ఈ మొక్క ఆకుల పేస్ట్ ను రాయడం వల్ల అవి త్వరగా మానుతాయి. అంతేకాకుండా పులిపంజా మొక్క ఆకుల పేస్ట్ ను నుదుటిపై రాయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. పూర్వకాలంలో ఈ మొక్క ఆకులను మెడలో ధరించే విధంగా తయారు చేసి వాటిని పిల్లల మెడలలో వేసేవారు. ఇలా చేయడం వల్ల ఏ దుష్ట శక్తులు కూడా వారి దరిచేరకుండా ఉంటాయని నమ్మేవారు. ఈ విధంగా పులిపంజా మొక్క మనకు వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఉపయోగపడుతుందని, దీనిని ఉపయోగించడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.