Badam Halwa : బాదంపప్పు అంటే సహజంగానే అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చాలా మంది దీన్ని నీళ్లలో నానబెట్టి తింటారు. అయితే బాదంపప్పుతో మనం వివిధ రకాల వంటకాలను కూడా తయారు చేయవచ్చు. వాటిల్లో బాదం హల్వా కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. కాస్త శ్రమించాలే కానీ దీన్ని ఎంతో రుచిగా ఇంట్లోనే తయారు చేయవచ్చు. ఇక బాదం హల్వాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం హల్వా తయారీకి కావల్సిన పదార్థాలు..
బాదంపప్పు పలుకులు – 1 కప్పు, పంచదార – అర కప్పు, నీళ్ళు – 5 కప్పులు, నెయ్యి – అర కప్పు, కుంకుమ పువ్వు – 7.
బాదం హల్వాను తయారు చేసే విధానం..
బాదంపప్పును నీటిలో వేసి సుమారుగా 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వాటి పొట్టు తీసి సిద్ధం చేయాలి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నాలుగు కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. నీళ్ళు మరిగాక బాదం పప్పు వేసి పది నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన బాదంపప్పులో మళ్లీ ఒక కప్పు నీటిని పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ పై పెట్టి ఒక కప్పు నీరు పోసి అందులో పంచదార వేసి కరిగించుకోవాలి. ఇందులో కుంకుమ పువ్వు కుడా వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని సన్నని సెగ మీద ఉడికించుకోవాలి. పక్కన వేరే పాన్‌లో నెయ్యి వేసి అది వేడయ్యాక బాదం పేస్ట్ వేసి పది నిమిషాలు ఉడికించి అందులో పంచదార పాకం వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి నెయ్యి అంతా పైన తేలేవరకు ఉడికించాలి. ఇది చల్లారాక బౌల్ లో సర్వ్ చేసుకోవాలి. అంతే బాదం హల్వా రెడీ అవుతుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.