Canola Oil : ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న సమస్యల్లో ఊబకాయం సమస్య ఒకటి. ఈ సమస్యకు కారణం శరీరంపై తగినంత శ్రద్ధ చూపించకపోవడం, అతిగా తినడం, ఎక్కువ సేపు కూర్చోని పని చేయడం, జంక్ ఫుడ్స్ అలాగే ఫాస్ట్ ఫుడ్స్ ను ఎక్కువగా తినడం వంటి వాటిని కారణాలుగా చెప్పవచ్చు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఊబకాయం సమస్య వేధిస్తుందని చెప్పవచ్చు. ఊబకాయం కారణంగా హార్ట్ ఎటాక్, అధిక రక్తపోటు, డయాబెటిస్, క్యాన్సర్ వంటి జబ్బుల బారిన పడి ఆకస్మిక మరణానికి గురి అవుతున్నారు. ఇన్ని విధాలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్న ఊబకాయాన్ని, బాన పొట్టను తగ్గించుకోవడం ఇప్పుడు చాలా తేలికని నిపుణులు చెబుతున్నారు.
బాన పొట్టను, ఊబకాయాన్ని తగ్గించకోవడం కెనోలా ఆయిల్ తో సాధ్యమవుతుందని వారు చెబుతున్నారు. కెనోలా ఆయిల్ తో బాన పొట్టను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా బాన పొట్ట సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కింద కూర్చోవడానికి వీలు లేకుండా పొట్ట ఇబ్బంది పెడుతుంది. ఈ పొట్ట కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఏ పని కూడా చేయలేకపోతుంటారు. మెట్లు ఎక్కలేకపోతుంటారు. బరువులు ఎత్తలేకపోతుంటారు. అలాంటి వారు వరుసగా నాలుగు వారాల పాటు కెనోలా ఆయిల్ ను వాడితే ఎలాంటి పొట్టైనా ఇట్టే కరిగిపోతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆయిల్స్ లో కెనోలా ఆయిల్ ఒకటి. ఈ ఆయిల్ ను కెనోలా సీడ్స్ నుండి తయారు చేస్తారు. వీటిలో శాచురేటేడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తాయి. ఈ ఆయిల్ లో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్లు, అల్ఫా లినోలిక్ యాసిడ్ అనగా ఎఎల్ఎ లు అధికంగా ఉంటాయి. ఈ ఎఎల్ఎ లు గుండె సంబంధిత జబ్బులను, కొలెస్ట్రాల్, రక్తపోటుతోపాటు కడుపులోనూ, గుండెలోనూ వచ్చే మంటలను తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. ఈ ఆయిల్ ను వాడిన వారిలో పొట్ట తగ్గిందని వైద్య నిపుణులు జరిపిన పరిశోధనల్లో నిరూపితమైంది. కెనోలా ఆయిల్ ను వాడడం వల్ల బాన పొట్టతో పాటు ఊబకాయాన్ని కూడా తగ్గించుకోవచ్చని దీనిని వాడడం వల్ల చక్కటి ఫలితాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.