Diabetes : మనలో షుగర్ వ్యాధితో చాలా కాలంగా బాధపడే వారు అధికంగానే ఉండి ఉంటారు. షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మందులను, చికిత్సలను తీసుకునే ఉంటారు. అయినప్పటికీ షుగర్ వ్యాధి నియంత్రణలోకి రాక ఇబ్బంది పడుతున్న వారు కింద తెలిపే చిట్కాలను పాటించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచే సహజసిద్దమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వ్యాధిని తగ్గించడంలో ముందు వరుసలో ఉండే వాటిల్లో కాకరకాయ కూడా ఒకటి.
కాకరకాయ అనగానే కేవలం షుగర్ వ్యాధి గ్రస్తులకే ఇది పని చేస్తుందని అని అనుకోకూడదు. కాకరకాయలలో ఇతర పోషకాలతోపాటు కెరోటిన్ ఉంటుంది. కాకరకాయను తరచూ తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. హైబీపీ నియంత్రణలో ఉంటుంది. సోరియాసిస్ నియంత్రణలో కూడా కాకరకాయ ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో అధికంగా ఉండే పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ కాకర కాయలను కూరగా, జ్యూస్ గా, పొడిగా కూడా తీసుకోవచ్చు. వీటిని ఎలా తీసుకున్నా కూడా షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది.
అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు చేసే వాటిల్లో మెంతులు కూడా ఒకటి. ఒక గ్లాస్ నీటిలో రెండు టేబుల్ స్పూన్ల మెంతులను వేసి రాత్రంతా నానెట్టాలి. ఉదయాన్నే ఈ నీటిని పరగడుపున తాగాలి. ఇలా ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలోచక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దాల్చిన చెక్క కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కను వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఈ దాల్చిన చెక్కతో టీ ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండడంతోపాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
ఈ టీ ని తయారు చేసుకోవడానికి గాను ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో దాల్చిన చెక్కను లేదా దాల్చిన చెక్క పొడిని వేసి మరో 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దాల్చిన చెక్క టీ ని రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల షుగర్ వ్యాధి తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక తులసి ఆకులను ఉపయోగించి కూడా మనం షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చు. తులసి ఆకులను అలాగే తులసి ఆకుల రసాన్ని ఆయుర్వేదంలోనూ, ఇంటి చిట్కాల్లోనూ విరివిరిగా ఉపయోగిస్తారు. తులసి ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల గొంతునొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
ఈ కషాయాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండడంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. ఇక మామిడి ఆకులు కూడా షుగర్ వ్యాధిని నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో శుభ్రంగా కడిగిన మామిడి ఆకులను ముక్కలుగా చేసి వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే ఈ నీటిని వడకట్టి తాగాలి. ఇలా రోజూ తాగడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది.
వేప ఆకులు కూడా షుగర్ వ్యాధిని నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. సర్వరోగ నివారిణిగా వేప ఆకులను చెబుతుంటారు. కాలుష్యాన్ని నివారించగలిగే వేప సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. చర్మ రోగాలను, ప్రేగుల్లో చేరిన పురుగులు, మధుమేహం వంటి వాటికి ఔషధంగా వేప పని చేస్తుంది. రోజూ వేప ఆకులను పరగడుపున తినడం వల్ల కొద్ది రోజుల్లోనే షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. అవిసె గింజలు.. ఇవి షుగర్ వ్యాధిని, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. వీటిని రోజూ తినడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.
అలాగే నేరేడు పండ్లు కూడా షుగర్ వ్యాధి గ్రస్తులకు దివ్యౌషధంగా పని చేస్తాయి. నేరేడు పండ్లను తిన్నా లేదా వాటి గింజల పొడిని నీటిలో కలిపి తీసుకున్నా కూడా చక్కటి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల చాలా త్వరగా చక్కెర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.