Sleep : ప్రస్తుత కాలంలో అందరూ యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోతున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆశతో సంపాదన కోసం ఉరుకుల పరుగుల జీవనాన్ని అలవరుచుకుంటున్నాడు. రోజుకు 18 నుండి 20 గంటల వరకు ఆఫీస్ పనితోనే గడుపుతున్నారు. దాని వల్ల అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. తగినంత నిద్రలేక ఒత్తిడికి గురై వివిధ రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. నిద్రలేమి వల్ల కంటి చుట్టూ నల్లటి మచ్చలు ఏర్పడడం, చర్మం పై ముడతలు పడడం జరుగుతుంది. దాని వల్ల చిన్న వయసులోనే పెద్ద వయసు వారి లాగా కనిపించడం జరుగుతుంది.
దీని పైన పరిశోధనలు జరిగిన కొందరు శాస్త్రవేత్తలు ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టారు. నిద్ర మనిషికి దేవుడిచ్చిన వరం. మనుషులతో పాటు భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి నిద్ర అవసరం. నిద్ర అనేది శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. దైనందిక జీవితానికి నిద్ర చాలా అవసరం. మానవ జీవితానికి నిద్ర ప్రాథమిక అవసరమని శారీరపరంగా అత్యంత ముఖ్యమైనదని, నిద్ర పౌరుల ప్రాథమిక హక్కని, ఆరోగ్య జీవనానికి చాలా అవసరమైనదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వైద్య నిపుణులు జరిపిన పరిశోధనల్లో 8 గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారిలో శరీర సామర్థ్యం తగినట్టుగా గుర్తించారు.
నిద్ర గురించి ఇంకా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. చిన్న వయసులోనే వయసు పైబడిన వారిలా కనబడడానికి నిద్రలేమే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ యాంటీ ఏజెనింగ్ లక్షణాలను తగ్గించడంలో నిద్ర దివ్యౌషధంగా పని చేస్తుందని వారు చెబుతున్నారు. యాంటీ ఏజెనింగ్ లక్షణాలు తొలగిపోవాలంటే రోజుకు ఎనిమిది గంటలు తప్పకుండా నిద్రపోవాల్సిందేనని, నిద్రించేటప్పుడు తల, మెడ సమాంతరంగా ఉండేలా దిండును అమర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
దీని వల్ల కంటి చుట్టూ రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుందని, దాని వల్ల సాగినట్టుగా అవ్వకుండా కాంతివంతంగా తయారవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి సంపాదనకై పాకులాడుతూ నిద్ర పోకుండా పని చేయడం అలవాటు చేసుకోవడం వల్ల అజీర్తి, మలబద్దకం, నరాల బలహీనత, మధుమేహం, క్యాన్సర్ వంటి అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రతిరోజూ హాయిగా ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోవాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.